కాంట్రాక్టు పద్ధతిని రద్దు చేయాలి
సింగరేణి యాజమాన్యం కాంట్రాక్ట్ పద్ధతిలో చీఫ్ మెడికల్ ఆఫీసర్, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ల నియామకానికి నోటిఫికేషన్ జారీ చేయడం దుర్మార్గమని టీబీజీకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే సురేందర్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు పెట్టం లక్షణ్ పేర్కొన్నారు.
శ్రీరాంపూర్, మార్చి 16 : సింగరేణి యాజమాన్యం కాంట్రాక్ట్ పద్ధతిలో చీఫ్ మెడికల్ ఆఫీసర్, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ల నియామకానికి నోటిఫికేషన్ జారీ చేయడం దుర్మార్గమని టీబీజీకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే సురేందర్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు పెట్టం లక్షణ్ పేర్కొన్నారు. ఆదివారం స్థానికంగా వారు విలేకరులతో మాట్లాడారు. సింగరేణిలో అత్యంత కీలకమైన సెక్యూరిటీ, వైద్య శాఖలకు ఉన్నతాధికారులుగా సింగరేణి ఉద్యోగులై ఉంటేనే బాగుంటుందన్నారు.
కాంట్రాక్ట్ పద్ధతిలో నియమిస్తే అక్రమాలకు పాల్పడే ఆసారముంటుందని, ఆ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం డిప్యూటీ జనరల్ సెక్రటరీ బండి రమేశ్, కేంద్ర చీఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ పొగాకు రమేశ్, కేంద్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ అన్వేశ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

