అర్హులందరికీ రుణమాఫీ చేయాలి
అర్హులైన రైతులందరికీ ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా రుణమాఫీ అమలు చేయాలని బ్యాంకు అధికారులను కుమ్రం భీం ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే ఆదేశించారు. మంగళవారం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకును సందర్శించి రుణమాఫీ పథకం నిర్వహణ ప్రక్రియను పరిశీలించారు.
ఆసిఫాబాద్ అంబేదర్చౌక్, జూలై 23 : అర్హులైన రైతులందరికీ ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా రుణమాఫీ అమలు చేయాలని బ్యాంకు అధికారులను కుమ్రం భీం ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే ఆదేశించారు. మంగళవారం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకును సందర్శించి రుణమాఫీ పథకం నిర్వహణ ప్రక్రియను పరిశీలించారు. అక్కడికి వచ్చిన రైతులతో మాట్లాడారు. బ్యాంకు అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రుణమాఫీ పథకం అమలు మొదటి విడుతలో భాగంగా లక్ష రూపాయల లోపు రుణం రైతుల ఖాతాలలో నిధులు జమ చేయాలన్నారు. ఎలాంటి షరతులు విధించకుండా నిబంధనల మేరకు రుణ మొత్తాన్ని రైతులకు చెల్లించాలని ఆదేశించారు. రుణమాఫీ పథకాన్ని జిల్లాలో అర్హులైన రైతులందరికీ వర్తించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని తెలిపారు. ఈ కార్యక్రమంలో లీడ్ బ్యాంకు మేనేజర్ వీ జోషి, ఆసిఫాబాద్ తహసీల్దార్ దేశ్పాండే, బ్యాంకు మేనేజర్ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్ను.. సిక్కిం గవర్నర్గా నియమించడంపై నిరసనలు
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

