న్యూ ఇయర్ జోష్‌కు రెడీ
న్యూయర్ జోష్‌కు జిల్లా సిద్ధమవుతున్నది. 2022 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ 2023 కొత్త ఏడాదికి స్వాగతం పలికేందుకు జిల్లా వాసులు రెడీ అవుతున్నారు.
- కొత్త సంవత్సర వేడుకలకు సిద్ధంగా యువత
- ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపేందుకు ముందస్తు ప్లాన్
- నగరంతోపాటు పట్టణాలకు దూరంగా సంబురాలు చేసుకునేందుకు సిద్ధం
- బుక్ అవుతున్న రిసార్ట్లు, బంకెట్ హాల్స్
- బిజీగా మారిన బేకరీలు, స్వీట్స్ షాపులు
- సందడిగా మారనున్న జిల్లా
ఎదులాపురం, డిసెంబర్ 30 : న్యూయర్ జోష్‌కు జిల్లా సిద్ధమవుతున్నది. 2022 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ 2023 కొత్త ఏడాదికి స్వాగతం పలికేందుకు జిల్లా వాసులు రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో కొందరు శుక్రవారం నుంచి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుండగా, పలువురు రిసార్ట్లు, బ్యాంకెట్ హాల్లు, హాలిడే ట్రిప్‌లు బుక్ చేసుకుని వేడుకలకు సిద్ధమయ్యారు. రాబోయే కొత్త సంవత్సరం తమ జీవితంలో సుఖసంతోషాలు వెల్లివిరియాలని, సంతోషంగా గడవాలని ఆకాంక్షిస్తూ వేడుకలకు సిద్ధమవుతున్నారు. అలాగే, పలు కళాశాలలు, పాఠశాలల్లో సైతం వేడుకల కోసం నిర్వాహకులు సమాయత్తమవుతున్నారు.
నగరవాసులకు క్తొత కల్చర్..
న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా యువత కొత్త కల్చర్‌కు తెరలేపుతున్నారు. పట్టణాలు, నగరాల్లో వేడుకలకు దూరంగా ఉంటూ, ఫాం హౌస్‌లు, రిసార్ట్స్, బంకెట్ హాల్స్‌ను ముందుగా బుక్ చేసుకొని, వేడుకలను అక్కడే నిర్వహించుకునేందుకు సిద్ధమయ్యారు. అందుకు జిల్లా పరిసరాల్లోని పలు రిసార్ట్స్, ఫాంహౌస్‌ల నిర్వాహకులు సైతం ధరలను అందుబాటులోకి తీసుకువచ్చి తక్కువ ధరలో సేవలు అందిస్తున్నారు. ఈ క్రమం వారికి ఆయా రిసార్ట్లలోనే మద్యం, మాంసం, స్విమ్మింగ్ ఫూల్స్, క్యాంప్ ఫైర్ ఇలా యువతను ఆకట్టుకునే స్థాయిలో ఏర్పాటు చేస్తున్నారు. వీటితో పాటు యువత ఆసక్తిని బట్టి డీజేలు, లేజర్ లైటింగ్ ఇలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తున్నది. అలాగే, పది నుంచి 30 వరకు ఉన్న సభ్యులు బ్యాంకెట్ హాల్స్ బుక్ చేసుకుని వేడుకలు నిర్వహించుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇందులో తమకు కావాల్సిన మెనూకు 600 నుంచి 900 వరకు వెచ్చిస్తున్నారు.
బిజీగా మారనున్న బేకరీలు..
ప్రజల అభిరుచులకు అనుగుణంగా వ్యాపారులు.. నోరూరించే కేక్‌లను తయారు చేసి ప్రత్యేక ఆఫర్లను ప్రకటించారు. వెనీలా కేక్, స్ట్రాబెర్రీ, బట్టర్ స్కాచ్, ప్రూట్స్కేక్, కూల్కేక్తో పాటు పలు రకాలైన కేక్‌లను అమ్మకాలకు సిద్ధం చేస్తున్నారు. యువతను ఆకర్షించేందుకు కేక్‌లను కేజీకి 250 నుంచి 800 వరకు అమ్మకాలకు పెట్టారు. ఎగ్‌లెస్, కూల్ కేక్‌లు కేజీ 350 నుంచి 1500 వరకు విక్రయిస్తున్నారు. వీటితోపాటు ప్రత్యేక ధరలతో చికెన్, మటన్, చికెన్ ధమ్ బిర్యానీ, వెజ్ బిర్యానీ, విజిటేబుల్ బిర్యానీలను విక్రయిస్తున్నారు. వీటికి కూల్ డ్రింక్స్ బహుమతిగా ఇస్తూ పలు చోట్ల వ్యాపారులు జనాలను ఆకట్టుకున్నారు. నూతనంగా ఏర్పాటు చేసిన పలు బిర్యానీ కేంద్రాల నిర్వాహకులు తక్కువ ధరలకు కేజీ, 2 కేజీలు, 5 కేజీలు, 10 కేజీల బిర్యానీని బకెట్ల ద్వారా కస్టమర్లకు అందించనున్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కిలో రూ.15కే రేషన్ బియ్యం కొనుగోలు.. రూపు మార్చి రూ.100కు విక్రయం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

