ప్రజా సంక్షేమమే ధ్యేయం
ప్రజల సంక్షేమమే బీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని, వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ను ఆదరిస్తే మరింత అభివృద్ధికి పాటుపడుతానని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్‌రావు అన్నారు.
- మంచిర్యాల ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్‌రావు
- లక్షెట్టిపేటలో కార్యకర్తలతో సమావేశం
- హాజరైన పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత, ఎమ్మెల్సీ భానుప్రసాద్
లక్షెట్టిపేట, అక్టోబర్ 20 : ప్రజల సంక్షేమమే బీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని, వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ను ఆదరిస్తే మరింత అభివృద్ధికి పాటుపడుతానని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్‌రావు అన్నారు. పట్టణంలోని ఎస్పీఆర్ గార్డెన్స్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత, ఎమ్మెల్సీ భానుప్రసాద్‌తో కలిసి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో ఎక్కడ లేని పథకాలు ఇక్కడే అమలవుతున్నాయని, ప్రజలు గమనించి మూడోసారి కూడా బీఆర్ఎస్ను ఆదరించాలని కోరారు.
అదేవిధంగా పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత మాట్లాడుతూ ఎల్లంపల్లి ప్రాజెక్టు, గూడెం ఎత్తిపోతల పథకం, చెల్లంపేట ప్రాజెక్టుతో పాటు ఇటీవల హాజీపూర్ మండలంలోని పడ్తన్‌పల్లిలో మరో 1000 ఎకరాలకు సాగునీరు అందేలా చెక్‌డ్యాం పనులను మంత్రి హరీశ్ రావు ప్రారంభించారని గుర్తు చేశారు. ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీకి గానీ ఓటు వేస్తే బురదలో పోసిన పన్నీరు అవుతుందన్నారు. ఎమ్మెల్సీ భాను ప్రసాద్ మాట్లాడుతూ క్లబ్‌లు, సంపాదన కోసం పాటు పడే మనిషికి మంచిర్యాలను అప్పగిస్తే మనం చాలా నష్టపోవల్సి వస్తుందన్నారు. అందుకే అహర్నిషలు శ్రమించే బీఆర్ఎస్ అభ్యర్థి దివాకర్‌రావును మరోసారి గెలిపించుకోవాలని కోరారు. అనంతరం ఇటీవల మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరిన జడ్పీటీసీ చిన్నయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ విధి విధానాలు నచ్చకనే బీఆర్ఎస్లో చేరానన్నారు.
కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చే ఏ హామీ కూడా తీర్చుతుందనే నమ్మకం తనకే కాదు ఆ పార్టీ నాయకులకు లేదన్నారు. అనంతరం జడ్పీటీసీ ముత్తె సత్తయ్య నేతృత్వంలో మండలం నుంచి వివిధ గ్రామాలకు చెందిన సుమారు 1000 మంది కార్యకర్తలు, మహిళలు, యువకులు జడ్పీటీసీ సత్తయ్య అభిమానులు కాంగ్రెస్‌ను వీడి బీఆర్ఎస్లో చేరగా వారికి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అంతకుముందు పార్టీ శ్రేణులు, నాయకులు, జడ్పీటీసీ అభిమానులు వేల సంఖ్యలో పాత బస్టాండ్ నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అరవింద్‌రెడ్డి, డీసీఎమ్మెస్ చైర్మన్ తిప్పని లింగన్న, రైతుబంధు సమితి చైర్మన్ మోటపల్కుల గురువయ్య, మున్సిపల్ చైర్మన్ నలుమాసు కాంతయ్య, పార్టీ మండలాధ్యక్షుడు చుంచు చిన్నయ్య, పట్టణాధ్యక్షుడు పాదం శ్రీనివాస్, డీసీఎమ్మెస్ మాజీ చైర్మన్ కేతిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మండల ఉపాధ్యక్షుడు అంకతి రమేశ్, ప్రధానకార్యదర్శి కేతిరెడ్డి అనిల్ రెడ్డి, నడిపల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ విజిత్‌రావు, మాజీ ఎంపీపీ కట్ల చంద్రయ్య, పీఏసీఎస్ చైర్మన్ గోళ్ల కాంతయ్య, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు గోళ్ల రవీందర్, ప్రధానకార్యదర్శి ఆసాది పురుషోత్తం, యూత్ మండలాధ్యక్షుడు అంకతి గంగాధర్, కౌన్సిలర్లు సురేశ్ నాయక్, చాతారాజు రాజన్న, మెట్టు కల్యాణిరాజు, షబానా సజ్జు, నాయకులు అంకతి మల్లేశ్, చుంచు శ్రీనివాస్, చంద్రమౌళి, ముత్తె రాజ్‌కుమార్, బియ్యాల సుధాకర్, కేతిరెడ్డి జగన్మోహన్ రెడ్డి, సందెల వెంకటేశ్, రాజేశం, మోటపల్కుల శ్రీనివాస్, గుర్రాల శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఓర్వలేకే తప్పుడు ప్రచారం
హాజీపూర్, అక్టోబర్ 20 : రాష్ట్ర ప్రభుత్వం చేస్తు న్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే కాంగ్రెస్, బీజేపీ నాయకులు ప్రభుత్వం పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే దివాకర్ రావు మండిపడ్డారు. మండలంలోని ముల్కల్ల గ్రామంలో సర్పంచ్ మంచాల శ్రీనివాస్, నాయకులు, కార్యకర్తలతో కలిసి శుక్రవారం ఇంటింటా తిరుగుతూ సంక్షేమ పథకాలు, అభివృద్ధిని ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకుడు మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్ రావు వివిధ బ్యాంకులకు రూ. 800 కోట్లు అప్పు ఉండి ప్రజలకు ఏమీ సేవ చేస్తాడని ప్రశ్నించాడు. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టాలని కోరారు. కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షుడు కుడుక సత్యం, మండల ప్రధాన కార్యదర్శి మాధవరపు జీవన్ రావ్, మండల యువత అధ్యక్షుడు దొమ్మటి బాపు, నాయకులు తిరుపతి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

