నిర్మల్ అర్బన్, జూలై 18 ః ప్రతి పోలీసు ఉద్యోగి శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలని.. బెట్టింగులు, మద్యం, మాదకద్రవ్యాలు వంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని నిర్మల్ ఎస్పీ జానకీ షర్మిల సూచించారు. శనివారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కానిస్టేబుల్, హోంగార్డుల సమస్యలు తె లుసుకోవడానికి ద ర్బార్ను నిర్వహించారు. అంతకు ముందు వారాంతపు పరేడ్‌ను నిర్వహించారు. ముఖాముఖీ ద్వారా పోలీసుల విధి నిర్వహణ, సమస్యలు, వ్యక్తిగత ఇబ్బందులు తె లుసుకున్నారు. కార్యక్రమంలో ఆర్ఐలు రామ్ నిరంజన్, శేఖర్, రామకృష్ణ పాల్గొన్నారు.