అసలు చూపి.. నకిలీ ఇచ్చి..
అసలు బంగారాన్ని చూపి.. నకిలీది అంటగట్టి ప్రజలను మోసం చేస్తున్న ఇద్దరిని స్థానికులు గుర్తించి పోలీసులకు అప్పగించారు. వివరాల్లోకి వెళితే.. కురవి మండలం రాజోలుకు చెందిన సూపర్ మార్కెట్ వ్యాపారి రాజు వద్ద రాజస్థాన్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు కొన్ని నెలల నుంచి కిరాణా సామగ్రి కొనుగోలు చేస్తున్నారు.
- నకిలీ బంగారంతో రాజస్థాన్ వ్యక్తుల నయా మోసం
- బయ్యారంలో గుర్తించి దేహశుద్ధి, పోలీసులకు అప్పగింత
బయ్యారం, ఆగస్టు 15 : అసలు బంగారాన్ని చూపి.. నకిలీది అంటగట్టి ప్రజలను మోసం చేస్తున్న ఇద్దరిని స్థానికులు గుర్తించి పోలీసులకు అప్పగించారు. వివరాల్లోకి వెళితే.. కురవి మండలం రాజోలుకు చెందిన సూపర్ మార్కెట్ వ్యాపారి రాజు వద్ద రాజస్థాన్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు కొన్ని నెలల నుంచి కిరాణా సామగ్రి కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలో రాజుతో ఏర్పడిన పరిచయంతో రెండు నెలల క్రితం షాపు వద్దకు వెళ్లి తమ బంధువులకు ఆరోగ్యం బాగాలేదని, తమ వద్ద ఉన్న బంగారు చైన్ కుదువ పెట్టుకొని డబ్బులు ఇవ్వాలని ప్రాధేయపడ్డారు. తన దగ్గర డబ్బులు లేవని చెప్పినప్పటికీ వినకుండా పలుమార్లు బతిమిలాడారు.
బంగారం చైన్‌ను చూపించి, అందులో కొంత భాగాన్ని కట్ చేసి ఇచ్చి పరీక్ష చేయించుకోవాలని సూచించారు. రాజు దానిని పరీక్షించగా అసలైన బంగారమని తేలడంతో, 6 తులాల చైన్ పెట్టుకొని రూ. 2 లక్షలు ఇచ్చాడు. మరుసటి రోజు నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉండడంతో అనుమానం వచ్చి గొలుసును పరీక్షించగా, అది నకిలీ బంగారమని తేలింది. దీంతో రాజు సీసీ ఫుటేజ్ ఆధారంగా మోసం చేసిన వారి కోసం మిత్రులు, తెలిసిన వ్యక్తులతో ఆరా తీస్తున్నాడు. ఈ క్రమంలో మోసానికి పాల్పడిన వ్యక్తులు గురువారం బయ్యారంలో సంచరిస్తూ కనిపించగా, స్థానికులు గుర్తుపట్టి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఇద్దరి వద్ద అరకేజీ వరకు నకిలీ బంగారాన్ని గుర్తించారు. అనంతరం బయ్యారంలోని మిత్రుడి సమాచారంతో వ్యాపారి రాజు అక్కడికి చేరుకొని తనకు జరిగిన మోసాన్ని స్థానికులు, పోలీసులకు వివరించాడు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
- Tags
- fake gold
- gold chain
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

