చెన్నూర్, ఏప్రిల్ 17 : అగ్ని ప్రమాదాల నివారణపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని ఫైర్ అధికారి రాజేందర్ అన్నారు. అగ్ని మాపక వారోత్సవాల సందర్భంగా చెన్నూర్ పట్టణంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో బుధవారం అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు ఏలా నివారించాలనే విషయమై వైద్యులు, సిబ్బందికి అవగాహన కల్పించారు.
అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు చెన్నూర్ అగ్ని మాపక కేంద్రం సెల్ నంబర్ 8712699201, 8712699200 ల్యాండ్ ఫోన్ నంబర్ 08737-242101లకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో లీడిండ్ ఫైర్‌మన్ రమేశ్‌బాబు, ఫైర్‌మన్ ఆపరేటర్లు బానయ్య, మధూకర్, ఫైర్‌మన్ సుధాకర్, తహేర్పాష, ఇగ్బాల్, నాగరాజు పాల్గొన్నారు.