Tandur | తాండూర్లో భారీ బందోబస్తు మధ్య రైల్వే భూమి స్వాధీనం
తాండూర్ మండలంలోని రేచిని రోడ్ రైల్వే స్టేషన్ సమీపంలో గల భూమిని బుధవారం రైల్వే అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
తాండూర్, జూన్ 3 : మంచిర్యాల జిల్లా తాండూర్ మండలంలోని రేచిని రోడ్ రైల్వే స్టేషన్ సమీపంలో గల భూమిని బుధవారం రైల్వే అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తెల్లవారు జామున బెల్లంపల్లి రైల్వే ఇంజినీరింగ్ అధికారులు జీసీబీలు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, సివిల్ పోలీసులతో కలిసి పెద్ద ఎత్తున రైల్వే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని రైల్వే శాఖకు ఓ ప్రైవేటు సంస్థకు మధ్య వివాదాస్పదంగా ఉన్న భూమి చుట్టూ గల హద్దులను, అందులోని కట్టడాలను తొలగించారు.
నేషనల్ హైవేను ఆనుకొని నిర్మాణంలో ఉన్న ఓ కట్టడాన్ని సైతం కూల్చివేశారు. పెద్ద ఎత్తున రైల్వే అధికారులు, పోలీసులు, రైల్వే సిబ్బంది ఈ కూల్చివేతల్లో పాల్గొనడం మండల వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇది చూసేందుకు స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. సుమారు నాలుగు గంటల పాటు ఏక బిగిన రైల్వే అధికారులు తొలగింపు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ ఘటనపై బెల్లంపల్లి రైల్వే శాఖ కు చెందిన ఓ ఇంజినీరింగ్ అధికారిని వివరణ కోరగా రైల్వే ఆస్తులను కాపాడుకోవడం నిత్య చర్యల్లో భాగంగా తొలగించామన్నారు.
గతంలో ఈ భూమిపై కోర్టు స్టే ఆర్డర్ ఉన్నదని, ప్రస్తుతం అది తొలగిపోయిందన్నారు. కోర్టు ఆదేశాల మేరకే ఈ భూమిని రైల్వే శాఖ స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. ఇందులో పెద్ద ప్రత్యేక విషయం ఏమీ లేదని కొట్టిపారేశారు. ఈ తొలగింపుల్లో బెల్లంపల్లి రైల్వే ఇంజనీరింగ్ శాఖ అధికారులతో పాటు తాండూర్ సీఐ దేవయ్య, తాండూర్, మాదారం తాళ్ల గురజాల ఎస్ఐలు ప్రసాదరావు, సౌజన్య, రామకృష్ణ, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Revanth Reddy | సాగుకు చుక్కనీరూ ఇవ్వలేను.. తాగునీళ్లూ లేవు.. వచ్చే 10 నెలలూ ఇంతే.. చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి
Horoscope | 24-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
కాళేశ్వరాన్ని తిట్టి.. కరువులోకి నెట్టి.. కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే రాష్ర్టానికి దుర్భిక్షం
రఘునందన్ కృషి స్ఫూర్తిదాయకం.. నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటయ్
ఎన్హెచ్ఎం ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

