ఐక్యతతోనే హక్కులను సాధింగలం : వక్తలు
తాండూర్ మండల కేంద్రం ఐబీలో ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ ఆధ్వర్యంలో కొమురం భీం వర్ధంతిని ఘనంగా నిర్వహించారు.
తాండూర్, అక్టోబర్ 28 : ఆదివాసీ వీరుడు, హక్కుల పోరాట యోధుడు, జల్-జంగల్- జమీన్ నినాద ప్రదాత కొమురం భీం వర్ధంతి వేడుకలను బుధవారం మంచిర్యాల జిల్లా తాండూర్ మండల కేంద్రం ఐబీలో ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కొమురం భీం చిత్రపటానికి ఆదివాసీ సంఘం నాయకులు, వివిధ పార్టీల నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన చేసిన పోరాటాలను, ఆదివాసీ సమాజానికి అందించిన స్ఫూర్తిని నాయకులు స్మరించుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కొమురం భీం తన జీవితాన్ని ఆదివాసీల హక్కుల పరిరక్షణ కోసం అంకితం చేశారని, భూమి, అడవి, నీటిపై ఆదివాసీలకు హక్కులు ఉండాలని పోరాటం చేశారని పేర్కొన్నారు.
ఆయన చూపిన పోరాట మార్గంలో పయనిస్తూ ఆదివాసీ హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆదివాసీల ఐక్యతతోనే హక్కులను సాధించుకోగలమని, ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు.
కొమురం భీం ఆశయాలను నేటి యువత ఆదర్శంగా తీసుకొని ఆదివాసీ సమాజ అభివృద్ధి కోసం ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ తాండూరు మండల అధ్యక్షుడు యాపాల సమ్మయ్య, తుడుందెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గడ్డం మణికుమార్, మంచిర్యాల జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు కుల్సెంగ బాపురావు, కొలవార్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు గొలిశెట్టి బాపు, తుడుందెబ్బ విద్యార్ధి సంఘం మండల ప్రధాన కార్యదర్శి అల్లకొండ అంజి, నాయకులు సిరంగి శంకర్, సూరం రవీందర్ రెడ్డి, సర్పంచులు గాట్ల నర్సయ్య, ప్రభాత్-రావు అచ్చలపూర్ ఉపసర్పంచ్ గట్టు సంతోష్ కుమార్, తుడుందెబ్బ మండల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA Sudheer Reddy | ఎవరి గూడు చెదరనివ్వబోం.. మూసీ పునరుద్ధరణకు బీఆర్ఎస్ వ్యతిరేకం కాదు : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
తక్కెళ్లపాడు సర్పంచ్‌కు మంత్రి సీతక్క ప్రశంస
Arnab Cyclone | ‘అర్నబ్’ ఎఫెక్ట్.. ఏపీలో మరో ఏడు రోజులు కుండపోత వర్షాలు..!
‘నవంబర్ 3న జరిగే జాతీయవాదుల సంగమం–2026ను విజయవంతం చేయాలి’
అప్పాజీపేట, నర్సింగ్‌బట్లలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

