మంచిర్యాల అర్బన్, ఆగస్టు 8 : బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా మంచిర్యాల జిల్లాకు చెందిన బింగి ప్రవీణ్ నియమితులయ్యారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్‌రావు సూచనల మేరకు ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గంధమల్ల ఆనంద్‌గౌడ్ శుక్రవారం రాష్ట్ర కార్యవర్గ సభ్యుల నియామకాలను ప్రకటించారు.
ఈ సందర్భంగా బింగి ప్రవీణ్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్‌రావు, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గంధమల్ల ఆనంద్‌గౌడ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెర్రబెల్లి రఘునాథ్‌రావు, మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్గౌడ్కు కృతజ్ఞతలు తెలిపారు. ఓబీసీల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.