బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పుట్టిన రోజు వేడుకలు శుక్రవారం పండుగలా నిర్వహించారు. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో అన్ని మండల కేంద్రాల్లో, పలు గ్రామాల్లో పార్టీ శ్రేణులు, అభిమానులు భారీ కేక్‌లు కట్ చేసి, మిఠాయిలు పంపిణీ చేశారు. నిరుపేదలకు అన్నదానంతో పాటు హాస్పిటళ్లలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. కేటీఆర్ సుఖ సంతోషాలతో ఉండాలని, నిండూ నూరేళ్లు వర్ధిల్లాలని దీవిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. స్వరాష్ట్ర సాధనలో, రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తెలంగాణ అభివృద్ధికి కేటీఆర్ ఎనలేని కృషి చేశారన్నారు. ప్రతి కార్యకర్తకూ అండగా ఉంటూ రైతులు, నిరుద్యోగుల సమస్యలపై పోరాడుతున్నారని కొనియాడారు. ‘జయహో రామన్న’ అంటూ నినాదాలు చేశారు.
ఆదిలాబాద్ ( నమస్తే తెలంగాణ)/ఇచ్చోడ/ఉట్నూర్ రూరల్ జూలై 24 : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టిన రోజు వేడుకలను ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. ఇచ్చోడ, నేరడిగొండలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నోట్ పుస్తకాలు, పెన్సిళ్లు, పెన్నులు పండ్లను పంపిణీ చేశారు. బజార్హత్నూర్, ఇందవెల్లిలోని ప్రభుత్వ దవాఖానల్లో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. పేదలకు నిత్యావసర సరుకులు అందజేశారు. ఉట్నూర్‌లో బీఆర్ఎస్ నాయకులు కేక్కట్చే సి పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. కేటీఆర్ జన్మదిన సందర్భంగా మహారాష్ట్రలోని బాబ్లీ వద్ద మాజీ రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్‌తో కలిసి ముక్రా(కే) మాజీ సర్పంచ్ మీనాక్షి, బీఆర్ఎస్ నాయకులు మొక్కలు నాటారు. అనంతరం కేక్ కట్ చేసి సంబురాలు నిర్వహించారు. ఉట్నూర్‌లో వికాసం పాఠశాలలో బీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు ధరణి రాజేశ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షడు పంద్ర జైవంత్‌రావు, నాయకులతో కలిసి విద్యార్థులకు పండ్లు పంపిణీ చేశారు. బోథ్ సొనాల మండలంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన బీఆర్ఎస్ నాయకులు వేడుకలు నిర్వహించారు. పత్తి చేనులో కేక్ కట్ చేసి సంబురాలు నిర్వహించారు.

నిర్మల్ (నమస్తే తెలంగాణ)/నిర్మల్ చైన్‌గేట్/ఖానాపూర్/ముథోల్ జూలై, 24 : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు నిర్మల్ జిల్లాలోని అన్ని మండలా ల్లో ఘనంగా జరిగాయి. నిర్మల్ జిల్లా కేంద్రంతో పాటు ఖా నాపూర్ పట్టణాల్లోని ప్రభుత్వ దవాఖానల్లో బీఆర్ఎస్ నా యకులు రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. రోగుల ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. మరోవైపు బాసర మండలం బిద్రెల్లితో పాటు కుబీర్ మండల కేంద్రం లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకున్నారు. నిర్మల్ పట్టణంలోని మాతా శి శు ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షు డు మారుగొండ రాము, రిజ్వాన్, మహేష్‌రెడ్డి, తదితరులున్నారు. వృద్ధాశ్రమంలో నిర్మల్ 9వ వార్డు కౌన్సిలర్ మంచాల శ్రీకాంత్‌యాదవ్ ఆధ్వర్యంలో అన్నదానం చేశా రు. ఖానాపూర్ పట్టణంలోని జంగల్ హనుమాన్ శివసాయి సాయిబాబా ఆలయంలో పార్టీ శ్రేణులు కేటీఆర్ పేరుపై ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ప్రభుత్వ దవాఖానలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ షోయోబ్ హూస్సేన్, కౌన్సిలర్లు తాళ్లపల్లి రాజగంగన్న, తొడసం ఇందిర, నాయకులు రాథోడ్ రామునాయక్, గౌరికర్ రాజు, కొక్కుల ప్రదీప్, కొడారి గోపాల్, నాయకులు, కార్యకర్తలున్నారు. ఖానాపూర్ మండలంలోని గోసంపల్లిలోని వరి పొలంలో వ్యవసాయదారులతో కలిసి బీఆర్ఎస్ నాయకులు కేక్ కట్ చేసి సంబురాలు నిర్వహించారు. సర్పంచ్ కొక్కుల సుభద్ర ఆధ్వర్యంలో నారుమడిలో ‘హెచ్‌బీడీ కేటీఆర్’ అని పేరు కనిపించేలా వరినారుతో అక్షరాలతో తీర్చిదిద్దారు.

బాసర మండలంలోని బిద్రెల్లిలో జరిగిన వేడుకల్లో రాజ్యసభ మాజీ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ హాజరై నాయకులతో కేక్ కట్ చేసి సంబురాలు నిర్వహించారు. అనంతరం మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో సమన్వయ సమితి సభ్యులు డాక్టర్ కిరణ్ కొమ్రేవార్, రమాదేవి, బీఆర్ఎస్ ముథోల్ మండల అధ్యక్షుడు కొర్వ శ్యామ్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.