డ్రగ్స్ రహిత సమాజాన్ని స్థాపిద్దాం
మాదకద్రవ్యాల రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిర్మూలన దినోత్సవం సందర్భంగా బుధవారం మంచిర్యాల పట్టణంలోని ఐబీ చౌరస్తా నుంచి జడ్పీ బాలుర పాఠశాల వరకు అవగాహన ర్యాలీ తీశారు. ఈ ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు.
- మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్
- మాదకద్రవ్యాల నిర్మూలన దినోత్సవ ర్యాలీ
మంచిర్యాలటౌన్, జూన్ 26 : మాదకద్రవ్యాల రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిర్మూలన దినోత్సవం సందర్భంగా బుధవారం మంచిర్యాల పట్టణంలోని ఐబీ చౌరస్తా నుంచి జడ్పీ బాలుర పాఠశాల వరకు అవగాహన ర్యాలీ తీశారు. ఈ ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ డ్రగ్స్ వాడితే జరిగే అనర్థాలను విద్యార్థి దశ నుంచే వివరించాలన్నారు.
మత్తు పదార్థాల బారిన పడిన వారిని మాన్పించేందుకు ప్రభుత్వ దవాఖానల్లో డీ అడిక్షన్ సెంటర్లలో ఉచితంగా చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ఎక్సైజ్ శాఖ జిల్లా సూపరింటెండెంట్ కే జీ నందగోపాల్ మాట్లాడుతూ ఎవరైనా డ్రగ్స్ అమ్మినా, వాడినట్లు తెలిసినా నార్కోటిక్స్ శాఖ టోల్‌ఫ్రీ నంబర్ 14446కు గానీ, 8712671111 నంబర్‌కు సమాచారం అందించాలని కోరా రు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మోతీలాల్, ఏసీపీ ప్రకాశ్, పట్టణ సీఐ బన్సీలాల్, ట్రాఫిక్ సీఐ నరేశ్, ఎక్సైజ్ సీఐ గురువయ్య, డీఐఈవో శైలజ, సంక్షేమశాఖ అధికారి చిన్నయ్య, పలు ప్రభుత్వ శాఖల అధికారులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు పాల్గొన్నారు.

మాదకద్రవ్యాలను నిర్మూలించాలి
ఆసిఫాబాద్ టౌన్, జూన్ 26 : మాదకద్రవ్య రహిత సమాజం కోసం కృషి చేయాలని ఆసిఫాబాద్ జిల్లా జడ్జి ఎంవీ రమేశ్, కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే పిలుపునిచ్చారు. జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవంలో జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు, సీనియర్ సివిల్ జడ్జి యువరాజ, సిర్పూర్ ఎమ్మెల్యే హరీశ్ బాబుతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ యువత ‘లవ్, లస్ట్, లికర్’పై అప్రమత్తంగా ఉండాలన్నారు. కోర్టుకు వచ్చే అనేక కేసులు మాదకద్రవ్యాలతో ముడిపడి ఉన్నాయని పేర్కొన్నారు.
అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో అన్ని శాఖల సమన్వయంతో మాదకద్రవ్యాల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు మాట్లాడుతూ సమాజంలో తొంభై శాతం నేరాలకు సెల్ఫోన్లు, నారోటిక్స్ డ్రగ్స్ కారణమని తెలిపారు. సిర్పూర్ ఎమ్మెల్యే హరీశ్‌బాబు మాట్లాడుతూ జిల్లాలోని దహెగాం మండలానికి చెందిన చిన్నారిపై జరిగిన అత్యాచార సంఘటనలో కూడా గంజాయి ప్రభావం ఉన్నదని గుర్తు చేశారు. అనంతరం ర్యాలీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి భాసర్, డీఈవో అశోక్, డీఎస్పీ సదయ్య, అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

