ఆశ్రమాల్లో చన్నీటి స్నానం
ఐటీడీఏ ఆశ్రమ పాఠశాలలతో పాటు కస్తూర్బా విద్యార్థులకు చన్నీటి స్నానాలు తప్పడం లేదు. ఆయా చోట్ల సోలార్ హీటర్లు ఏర్పాటు చేయగా, అవి పనిచేయకపోవడంతో చేతి పంపులు, నీటి ట్యాంకులను ఆశ్రయిస్తూ అష్టకష్టాలు పడుతున్నారు.
- గిరిజన పాఠశాలల్లో పనిచేయని సోలార్ హీటర్లు
- ఒక్కోచోట రూ. 3 లక్షలతో ఏర్పాటు
- చేతి పుంపులు, నీటి ట్యాంకుల వద్ద విద్యార్థుల అవస్థలు
- తీవ్రమైన చలితో అనారోగ్యం
- సమస్య పరిష్కరించాలని వేడుకోలు
ఐటీడీఏ ఆశ్రమ పాఠశాలలతో పాటు కస్తూర్బా విద్యార్థులకు చన్నీటి స్నానాలు తప్పడం లేదు. ఆయా చోట్ల సోలార్ హీటర్లు ఏర్పాటు చేయగా, అవి పనిచేయకపోవడంతో చేతి పంపులు, నీటి ట్యాంకులను ఆశ్రయిస్తూ అష్టకష్టాలు పడుతున్నారు. సకాలంలో తరగతులకు హాజరుకావాలనే ఉద్దేశంతో తప్పనిసరి పరిస్థితుల్లో తీవ్రమైన చలిలో స్నానాలు చేస్తూ అనారోగ్యం బారిన పడుతున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి తమ సమస్యకు పరిష్కారం చూపాలని వేడుకుంటున్నారు.
– కుమ్రం భీం ఆసిఫాబాద్ (నమస్తే తెలంగాణ)/కెరమెరి, డిసెంబర్ 15
కుమ్రం భీం ఆసిఫాబాద్ (నమస్తే తెలంగాణ)/కెరమెరి, డిసెంబర్ 15 : ఉట్నూర్‌లో ఐటీడీఏ పరిధిలో 104 గిరిజన ఆశ్రమ పాఠశాలలు, కస్తూర్బా విద్యాలయాలు ఉన్నాయి. ఆయాచోట్ల ఇంటిగ్రేటెడ్ యాక్షన్ ప్లాన్ (ఐఏపీ) నిధులతో సోలార్ వాటర్ హీటర్లను ఏర్పాటు చేశారు. ఎలాంటి టెండర్లు లేకుండానే ఓ సంస్థకు ఆశ్రమాల్లో సోలార్ హీటర్లు ఏర్పాటు చేసే బాధ్యత అప్పగించారు. ఒక్కోచోట రూ. 3 లక్షలతో సోలార్ హీటర్ ఏర్పాటు చేశారు. అయితే నాసిరకమైన హీటర్లను ఏర్పాటు చేయడం వల్ల అవి ఒక్క రోజు కూడా పనిచేయలేదన్న ఆరోపణలున్నాయి.

సోలార్ వాటర్ హీటర్ల నిర్వహణపై అధికారుల పర్యవేక్షణ పూర్తిగా కొరవడింది. ఇంజినీరింగ్ అధికారులు కూడా పట్టించుకోకపోవడంతో ఫలితం లేకుండా పోయింది. దీంతో ఆయా చోట్ల చదువుతున్న విద్యార్థులు చేతి పంపుల వద్ద, నీటి ట్యాంకుల వద్ద చల్లని నీళ్లతో స్నానాలు చేస్తూ అనారోగ్యం బారిన పడుతున్నారు. ఇకనైనా సోలార్ హీటర్లను బాగు చేయించాలని తమ ఇబ్బందులు దూరం చేయాలని వారు కోరుతున్నారు.
మస్తు తిప్పలైతంది
మా స్కూల్లో వాటర్ హీటర్ పనిచేస్తలేదు. పొద్దుగాల లేచి చల్లని నీటితో స్నానం చేయాల్సి వస్తుంది. ఎండవచ్చినంక చేద్దామంటే అప్పటికే బడి టైమ్ అయిపోతంది. చలిలో తప్పని పరిస్థితుల్లో స్నానాలు చేయాల్సి వస్తోంది. మస్తు తిప్పలైతంది. సార్లు మా బాధను అర్థం చేసుకొని హీటర్‌ను మంచిగ చేయించాలి.
– కోట్రంగే అంకిత, 6వ తరగతి, కేజీబీవీ మోడి.
హీటర్ ఉండి లాభం లేదు
మా స్కూల్లో వాటర్ హీటర్ ఉండి లాభంలేకుంటైంది. ఇది వరకు మంచిగనే పని చేసింది. ఇప్పుడు పాడైంది. ఎండకాలం అంటే వెళ్లదీసినం. వానకాలం, చలికాలంల మస్తు తిప్పలైతంది. అంత పొద్దున లేచి స్నానం చేయాల్నంటే భయమైతంది. ఈ వారం నుంచైతే మరీ దారుణంగా చలి పెరిగింది. సార్లు మా గోస చూడాలే..
– కాత్లే పాండు, 7వ తరగతి, హట్టి ఆశ్రమ పాఠశాల
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ghee Benefits | నెయ్యితో యవ్వనం సాధ్యమేనా? చర్మ సౌందర్యానికి నెయ్యి ఎలా ఉపయోగపడుతుందో తెలుసా?
CM Bhagwant Mann: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో పంజాబ్ సీఎం నిర్బంధం.. భగవంత్ మాన్కు 50వేల ఫైన్
Rob Jetten | తండ్రి కాబోతున్న తొలి గే ప్రధాని.. 2027లో కలుద్దాం అంటూ భావోద్వేగ పోస్టు!
Asian Para Games: మెన్స్ షాట్‌పుట్‌లో సచిన్‌కు గోల్డ్.. భారత్ పోడియం స్వీప్
నవరాత్రి వేడుకల్లో మాళవిక మోహనన్ సందడి.. రాయల్ లుక్‌లో ఫొటో గ్యాలరీ!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

