శివగూడలో సూడసక్కని ఇండ్లు
కెరమెరి నుంచి జోడెఘాట్ వెళ్తుంటే అడవిలో కనిపించే అందమైన గ్రామమే శివగూడ. కాటేజీలను తలపించేలా ఇక్కడ నిర్మించిన రెడిమేడ్ ఇండ్లు చూడగానే ఆకట్టుకుంటున్నాయి. సిమెంటు, ఇటుక, ఇసుక వాడకుండా పర్యావరణహితంగా ఆధునిక హంగులతో నిర్మించిన ఈ ఇండ్లు ప్రత్యేక ఆకర్శణగా నిలుస్తున్నాయి.
- కొలాం గ్రామంలో 13 రెడీమేడ్ గృహాలు నిర్మించిన సర్కారు
- ఒక్కోదానికి రూ. 3 లక్షలు
- సర్కారుకు రుణపడి ఉంటామంటున్న గిరిబిడ్డలు
కుమ్రం భీం ఆసిఫాబాద్ (నమస్తే తెలంగాణ)/ కెరమెరి, సెప్టెంబర్ 16 : కెరమెరి నుంచి జోడెఘాట్ వెళ్తుంటే అడవిలో కనిపించే అందమైన గ్రామమే శివగూడ. కాటేజీలను తలపించేలా ఇక్కడ నిర్మించిన రెడిమేడ్ ఇండ్లు చూడగానే ఆకట్టుకుంటున్నాయి. సిమెంటు, ఇటుక, ఇసుక వాడకుండా పర్యావరణహితంగా ఆధునిక హంగులతో నిర్మించిన ఈ ఇండ్లు ప్రత్యేక ఆకర్శణగా నిలుస్తున్నాయి. ఇక్కడ మొత్తం 13 కొలాం గిరిజన కుటుంబాలుండగా, ప్రభుత్వం ఐటీడీఏ ద్వారా అందరికీ ఇండ్లు నిర్మించి ఇచ్చింది. ఒక్కో ఇంటికి రూ. 3 లక్షలు వెచ్చించింది. 20 ఏండ్ల దాకా మన్నిక ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నది. హాల్, బెడ్రూం, కిచెన్, మరుగుదొడ్డివంటి వాటితో ఇండ్లను పూర్తి చేసింది. కిటికీలకు కూలింగ్ అద్దాలు ఏర్పాటు చేసి ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. పై కప్పులో రేకులు.. ప్రత్యేకమైన ఫ్లైవుడ్తో గోడలు, ఇంటిలోపు ఆకర్శణీమైన టైల్స్ వేశారు. కరెంటు, లైట్లు, ఫ్యాన్లు అన్ని ప్రభుత్వమే ఏర్పాటు చేసింది. లబ్ధిదారుల వద్ద రూపాయి కూడా తీసుకోకుండా కొలాం గిరిజనుల సొంతింటి కలను సాకారం చేసింది. ఒకప్పుడు పూరి గుడిసెల్లో అష్టకష్టాలు పడ్డ వారంతా నేడు సొంత ఇండ్లలో ఆనందంగా జీవిస్తున్నారు.
ఇసొటి ఇంట్లో ఉంటమనుకోలే
నా ఊహ తెలిసినప్పటి నుంచి గడ్డిగుడిసెల్లో ఉన్నం. వానొస్తే ఉరుస్తుండే.. ఇంట్లో ఉండలేని పరిస్థితి ఉండే. తెలంగాణ సర్కారు మాకు ఇంత మంచి ఇండ్లు కట్టిస్తదనుకోలే. ఇసొంటి ఇండ్లు మేము ఇంత వరకు సూడలే. రూపాయి కూడా మా దగ్గర తీసుకోలే. అన్ని సౌలతులు కల్పించిన్రు. ఇప్పుడు రంది లేకుంట మంచిగ ఇంట్లో ఉంటున్నం. సర్కారుకు రుణపడి ఉంటం.
– ఆత్రం మారుబాయి, శివగూడ
బిల్డింగ్ల ఉన్నట్లుంది
పుట్టినప్పటి నుంచి పూరి గుడిసెల్లో ఉంటున్నం. సర్కారోళ్లు మాపై దయ సూపిన్రు. మంచి ఇళ్లు కట్టించిన్రు. పెద్ద పెద్ద బిల్డింగ్ల ఉన్నట్లుంది. కింద టైల్స్ వేసిన్రు. కరెంటు కూడా పెట్టించిన్రు. లైట్లు, ఫ్యాన్ కూడా ఏర్పాటు చేసిన్రు. ఇంతకుముందు గుడిసె ముందు రోజు పొద్దున్నే ఆవు పేడతో అలికేటోళ్లం. ఇప్పుడు వేసిన టైల్స్తో ఆ బాధ కూడా లేదు. మా బాధలను పట్టించుకున్న సర్కారోళ్లను తల్సుకుంటం.
– టేకం భీం బాయి, శివగూడ
అందరికీ ఒకేతీరుగా కట్టించిన్రు..
శివగూడలో మొత్తం 13 కుటుంబాలున్నాయి. అందరం కొలాం(కోలావర్)లమే. అందరికీ ఒకే తీరుగా ఇండ్లు కట్టించిన్రు. ఇంట్ల రెండు రూమ్లున్నయి. ఇంతకు ముందు మా ఊరిలో అన్ని గడ్డిగుడిసెలే ఉండేవి. ఇప్పుడు మంచి ఇండ్లయినయ్. సూసేందుకు చూడ ముచ్చటగా ఉన్నయి. జీవితంలో ఇసొంటి ఇల్లు కట్టుకునేటోళ్ల కాదు. మా గోస తీర్చిన గీ సర్కారుకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలం.
-టేకం భీం బాయి, శివగూడ
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

