పాఠ్యపుస్తకంలో ఎన్నికల పాఠం
విద్యార్థి దశలోనే ప్రజాస్వామ్యం, ఓటు హక్కు విలువను తెలియజేసేందుకు ప్రభుత్వం పదో తరగతి సాంఘిక శాస్త్రంలో ‘భారతదేశంలో ఎన్నికల ప్రక్రియ’ పాఠ్యాంశాన్ని ప్రవేశపెట్టింది. ఈ ఎన్నికల సమయంలోనే పాఠ్యాంశం సిలబస్‌లో ఉండడం విశేషం.
- పదో తరగతి సాంఘిక శాస్త్రం పుస్తకంలో పాఠ్యాంశం
- విద్యార్థి దశ నుంచే ప్రజాస్వామ్యంపై అవగాహన
ఇచ్చోడ, డిసెంబర్ 11 ః విద్యార్థి దశలోనే ప్రజాస్వామ్యం, ఓటు హక్కు విలువను తెలియజేసేందుకు ప్రభుత్వం పదో తరగతి సాంఘిక శాస్త్రంలో ‘భారతదేశంలో ఎన్నికల ప్రక్రియ’ పాఠ్యాంశాన్ని ప్రవేశపెట్టింది. ఈ ఎన్నికల సమయంలోనే పాఠ్యాంశం సిలబస్‌లో ఉండడం విశేషం. ఇందులో ఎన్నికల వ్యవస్థ నుంచి ఓటు హక్కు వినియోగం వరకు విద్యార్థులు సులభతరంగా అర్థం చేసుకునేలా పాఠ్యాంశంలో రూపొందించారు.
ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికల అవసరాన్ని గుర్తించి 1950 జనవరి 25న ఎన్నికల సంఘం ఏర్పడిందని, ఇది స్వయం ప్రతిపత్తి సంస్థ అని వివరించారు. 1952లో నిర్వహించిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో 17.32 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. ప్రస్తుతం 67 కోట్లు దాటిందని, ఎన్నికల నిర్వహణకు సివిల్ సర్వీస్‌లకు చెందినవారు ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా ఉంటారని పాఠ్యాంశంలో పేర్కొన్నారు. దీంతోపాటు ఎన్నికల సంఘం దేశంలో సుమారు 45 లక్షల మంది సిబ్బందితో భారీ ఎన్నికల ప్రక్రియ నిర్వహిస్తోందని పొందుపర్చారు.
కమిషన్ విధులు
ఎన్నికల నిర్వహణలో ఈసీ ప్రధాన పాత్ర పోషిస్తోంది. గతంలో భారత ఎన్నికల ప్రధాన కమిషనర్‌గా పనిచేసిన టీఎస్ శేషన్ ప్రజల అభిమానాన్ని చూరగొన్న తీరును వివరించారు. రాజ్యాంగంలోని 15 భాగంలోని ఆర్టికల్ 324 నుంచి 329 వరకు ఎన్నికల సంఘం నిర్మాణం, విధులను వివరించారు. ఓటర్ల జాబితాను రూపొందించడం మొదలు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల, నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, నామినేషన్ల ఉపసంహరణ, పోలింగ్ తేదీల ఖరారు, ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు పాటించాల్సిన నియమావళిని పొందుపర్చారు.

మా తల్లిదండ్రులకు చెప్పా..
ఎన్నికల గురించి మా పదో తరగతి పాఠ్యపుస్తకంలో పొందు పర్చిన అంశాలను మా తల్లిండ్రులతోపాటు 18 ఏండ్లు నిండిన యువతీ యువకులకు చెప్పాను. ఎన్నికల ప్రక్రియ రెండు విధాలుగా ఉంటుందని.. అసెంబ్లీ, పార్లమెంట్ ఎలక్షన్స్ ఈవీఎంలతో చేస్తారని, లోకల్ ఎన్నికల సర్పంచ్, జడ్పీటీసీ ఎన్నికల్లో బ్యాలెట్‌తో వేస్తామని చెప్పా.
– దొండే సంతోషి, విద్యార్థిని, పదో తరగతి
మంచి నిర్ణయం..
పదో తరగతి సాంఘిక శాస్త్రంలో ఎన్నిక ల ప్రక్రియపై పాఠ్యాంశాన్ని ముద్రించ డం అభినందనీయం. విద్యార్థి దశ నుం చే ఎన్నికలపై అవగాహన కల్పించడం సాధ్యమవుతుంది. ఇప్పుడు ఎన్నికల క్రమంలో ఈ పాఠం బోధిస్తే విద్యార్థు లు ఆసక్తిగా విన్నారు. ఎన్నికల నిర్వహ ణ, పోలింగ్ రోజున అధికారులు, ఏజెంట్ల విధులను పొందుప ర్చారు. పోలింగ్ రోజు ఏ అధికారి ఏ విధులు నిర్వర్తిస్తారో తెలిపారు.
– అంగ శ్రీనివాస్, ఉపాధ్యాయుడు, జడ్పీఎస్ఎస్, సిరికొండ
ప్రవర్తన నియమావళి
అభ్యర్థుల ప్రవర్తన నియమావళికి సంబంధించి 11 అంశాలను ఇందులో పొందుపర్చారు. రాజకీయ పార్టీ ఏ విధంగా గుర్తింపు పొందుతోంది. ఇందుకోసం ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలనే అంశాలను వివరించారు. ఎన్నికల సంఘం గుర్తులను ఎలా కేటాయిస్తోంది. ఓట్ల శాతం ఆధారంగా ఒక పార్టీని జాతీయ, ప్రాంతీయ పార్టీగా ఎలా గుర్తిస్తారో వివరించారు. పార్టీల ప్రచార సమయం, నిబంధనలు ఉల్లంఘిస్తే తీసుకునే చర్యలను పాఠ్యాంశంలో పొందుపర్చారు.
విధులు..
ఎన్నికల నిర్వహణలో భాగంగా పోలింగ్ రోజున అధికారులు, ఏజెంట్ల విధులను వివరించారు. ఓటర్లు స్వేచ్ఛగా ఓటు వేసేలా అధికారులు ఏర్పాట్లు చేయాలి. రాజకీయ పార్టీలు, ఓటర్లు ఎన్నికల విధులు నిర్వర్తించే సిబ్బందికి సహకరించడం, పోలింగ్ రోజున ఏ అధికారి ఏ విధులు నిర్వర్తిస్తారో తెలియజేశారు.
టీఎస్ శేషన్ సిఫార్సులు..
- భారత ఎన్నికల కమిషనర్‌గా 1990 నుంచి 1996 వరకు పని చేసిన టీఎస్ శేషన్ ఎన్నికల నిర్వహణలో పలు సంస్కరణలు తీసుకొచ్చారు. వాటిని ఈ పాఠ్యాంశంలో పొందుపర్చారు.
- ఎన్నికల ప్రచార సమయాన్ని నామినేషన్ ఉప సంహరించుకునేందుకు నిర్ణయించిన తేదీ నుంచి 14 రోజులుగా నిర్ణయించారు.
- ఒక అభ్యర్థి ఒకేసారి రెండు కంటే ఎక్కువ నియోజకవర్గాల నుంచి పోటీ చేయరాదు.
- ఒక వ్యక్తి ఏదైనా నేరంలో కనీసం రెండేళ్ల జైలు శిక్ష అనుభవిస్తే ఆరేళ్లపాటు పోటీకి అనర్హులు.
- పోటీలో ఉన్న అభ్యర్థి మరణిస్తే ఎన్నిక వాయిదా వేయాలి. కానీ.. రద్దు చేయరాదు.
- ప్రచారం పూర్తయిన తర్వాత 48 గంటల వరకు మద్యం అమ్మకాలు నిషేధించాలి.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sandeep Reddy Vanga | ‘స్పిరిట్’ తర్వాత సందీప్ రెడ్డి వంగా నెక్స్ట్ మూవీ ఫిక్స్.. ఎన్టీఆర్, మహేష్, బన్నీతో కాకుండా..
S.SRajamouli | ‘తమ్మీ నువ్వు మావోనివే’.. దుల్కర్ సల్మాన్‌పై రాజమౌళి ప్రశంసల వర్షం!
American Jets | ఒకదానినొకటి తాకిన రెండు విమానాల రెక్కలు.. తప్పిన పెను ప్రమాదం..!
Kaaka | చిరంజీవి ‘కాకా’ రిలీజ్‌పై క్లారిటీ.. సంక్రాంతి బరిలో మెగాస్టార్, జనవరి 13న మెగా పొంగల్!
Chiranjeevi | మెగాస్టార్‌గా ఎదగడానికి కారణం అదే.. బీర్ తాగమని ఫ్రెండ్స్ ఒత్తిడి చేసినా నో చెప్పా: చిరంజీవి
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

