అరచేతిలో మేడారం సమాచారం
ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు
భక్తులకు ఉపయోగకరంగా పూర్తి సమాచారం నిక్షిప్తం
ములుగు, ఫిబ్రవరి 7(నమస్తే తెలంగాణ): ఆదివాసీ గిరిజనులు తమ సంప్రదాయాల ప్రకారం నిర్వహించుకునే మేడారం సమ్మక-సారలమ్మ మహా జాతరకు సంబంధించిన పూర్తి సమాచారం భక్తుల అరచేతిలో స్మార్ట్ఫోన్ల ద్వారా కనిపించ నుంది. ఈ నెల 16 నుంచి 19వ తేదీ వరకు జరుగునున్న మేడారం మహా జాతరకు వచ్చే భక్తులకు ఉపయోగకరంగా ఉండే పూర్తి సమాచారాన్ని నిక్షిప్తం చేసి జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య నేతృత్వంలో ‘మేడారం జాతర గైడ్ అఫీషియల్’ అనే మొబైల్ యాప్‌ను రూపొందించారు. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. ప్లే స్టోర్‌లో లాగిన్ అయి ‘మేడారం మహా జాతర గైడ్ అఫీషియల్ అని ఇంగ్లిషులో టైప్ చేసిన వెంటనే సెల్ఫోన్లో యాప్ ప్రత్యక్షమవుతుంది. దీనిని డౌన్లోడ్ చేసుకున్న అనంతరం సీఎం కేసీఆర్ చిత్రపటంతో కూడిన యాప్ ప్రదర్శితమవుతోంది.
ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్..
జాతరకు వచ్చే భక్తులు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న వారి పేరు సెల్ నెంబర్ తదితర వివరాలను నమోదు చేసిన అనంతరం యాప్‌లో మేడారానికి సంబంధించిన పూర్తి విశేషాలు ప్రదర్శింపబడతా యి. ఈ యాప్‌లో భక్తులకు అవసరమైన పూర్తి వివరాలను పొందుపరిచారు. ఇందులో భాగంగా కరోన టీకాల కేంద్రాలు, మరుగుదొడ్లు నిర్మించిన ప్రాంతా లు, జంపన్నవాగు వద్ద నిర్మించిన స్నానఘట్టాలు, జాతర ప్రాంతంలో ఏర్పాటు చేసిన తాగునీటి కేం ద్రాలు, భక్తులు అనారోగ్యానికి గురైన సమయంలో అవసరమయ్యే మెడికల్ క్యాంపులు, వాహనాలను పారింగ్ చేసే స్థలాలు, జాతరలోని ముఖ్య వివరాలతోపాటు జాతరలో నాలుగు రోజులపాటు రోజువారీ నిర్వహించే ముఖ్య పూజా కార్యక్రమాలు, ఆర్టీ సీ బస్సుల ఏర్పాటు, జాతరలో తప్పిపోయిన వారి ఆచూకీ కనుగొనేందుకు ఏర్పాటు చేసిన మిస్సింగ్ కేంద్రాల వివరాలు ఉంటాయి.
పూర్తి సమాచారం నిక్షిప్తం
వివిధ ప్రాంతాల నుంచి జాతరకు చేరుకునేందుకు ఏర్పాటైన రోడ్డు మార్గాలు, భక్తులు జాతర ప్రాంగణంలో విడిది చేసే ప్రాంతాలు, జాతర ప్రాంగణం లో బంధుమిత్రులు ఉండే ప్రాంతాలు, ఆఫె్లైన్ నావిగేషన్ సౌకర్యం, మేడారం జాతర సందర్భంగా వివి ధ విభాగాల్లో నిర్వహించే పోటీలు, జాతర పరిసర ప్రాంతాలలో భక్తులు చేయాల్సిన, చేయకూడని ప నుల వివరాలతోపాటు జాతరకు రోడ్డు మార్గాన వ చ్చే క్రమంలో పాటించాల్సిన ట్రాఫిక్ నిబంధనలను అధికారులు పొందుపరిచారు. అదేవిధంగా వివిధ శాఖల ద్వారా భక్తులకు కల్పించిన సౌకర్యాల వివరాలను కూడా ఈ యాప్‌లో రూపొందించారు. ము ఖ్యంగా పోలీసు, వైద్య ఆరోగ్య శాఖ ద్వారా అందుతున్న సేవలను ప్రత్యేకంగా పొందుప రిచారు. వీటన్నింటితో పాటు యాప్ డౌన్లోడ్ చేసుకున్న వ్యక్తులు జాతరకు సంబంధించిన ఫొటోలు వీడియోలను త మ తమ సెల్ ఫోన్ల ద్వారా అప్లోడ్ చేసే వెసులుబా టు కూడా ఈ యాప్‌లో అధికారులు కల్పించారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
- Tags
- adilabad news
- play store
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | బాక్సాఫీస్ నుంచి గ్లోబల్ మార్కెట్ వరకు.. ప్రభాస్ క్రేజ్‌కు ఇదే నిదర్శనం!
Bhu Bharati | సర్వర్ డౌన్.. ఓటీపీలు రావు.. భూ భారతి సేవలతో రైతుల అవస్థలు
Graduate Voter Registration | ఓటు నమోదులో వెనుకబడ్డ పట్టభద్రులు.. ఆన్లైన్లో అవకాశమున్నా ఎందుకింత నిరాసక్తత?
Fauzi | ‘ఫౌజీ’ నుంచి క్రేజీ అప్డేట్.. ‘ఎవరతను?’ అంటూ ఆసక్తి పెంచిన మేకర్స్!
Hyderabad | హైదరాబాద్‌లో ట్యాంకర్లకు డిమాండ్.. రోజుకు 7 వేలు దాటిన బుకింగ్స్.. నీటికొరతతో అల్లాడుతున్న జనం
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

