భూ మాఫియా కుంభకోణం
బ్యాంకు, ఈడీ ఆధీనంలో ఉన్న విలువైన భూమిని, అధికారులతో కుమ్మక్కై నకిలీ పత్రాలు సృష్టించి సప్లమెంటరీ సెత్వార్ల ద్వారా కోట్ల రూపాయల భూమిని కాజేయడానికి ప్రయత్నించిన భూ మాఫియా ముఠాపై కేసు నమోదు చేసినట్లు ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్‌రెడ్డి తెలిపారు.
- ఈడీ, బ్యాంకు ఆధీనంలో ఉన్న కోట్ల భూమి కబ్జా బడాబాబులు, సర్వేయర్‌పై కేసు
ఆదిలాబాద్, అక్టోబర్ 12(నమస్తే తెలంగాణ) : బ్యాంకు, ఈడీ ఆధీనంలో ఉన్న విలువైన భూమిని, అధికారులతో కుమ్మక్కై నకిలీ పత్రాలు సృష్టించి సప్లమెంటరీ సెత్వార్ల ద్వారా కోట్ల రూపాయల భూమిని కాజేయడానికి ప్రయత్నించిన భూ మాఫియా ముఠాపై కేసు నమోదు చేసినట్లు ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్‌రెడ్డి తెలిపారు. ఈ కేసులో పది మందిపై కేసు నమోదు చేశామని రమేశ్ శర్మ(ఏ1) రియల్ ఎస్టేట్ వ్యాపారి, ఇబ్రహీం మహమ్మద్ (ఏ2) రియల్ ఎస్టేట్ వ్యాపారి, యతేంద్రనాథ్(ఏ3), హితేంద్రనాథ్(ఏ4), రాకేశ్ శర్మ(ఏ5), మనోజ్‌కుమార్ అగర్వాల్(ఏ6), పూనం వ్యాస్(ఏ7), అనుపమ వ్యాస్(ఏ8), శివాజీ(ఏ9), సర్వేయర్ ఉన్నారని తెలిపారు.
మనోజ్ కుమార్ సర్వే నంబరు 65 బై బీ, 65 బై 4 లోని 2.09 ఎకరాల భూమిని జీఎస్ అయిల్ మిల్ పేరిట ఎస్పీఐ బ్యాంకులో తనాఖా పెట్టి రుణం తీసుకున్నాడని పేర్కొన్నారు. 2012లో మనోజ్ అగర్వాల్ 65బై4బై1పేరిట 2.10 ఎకరాల భూమిని నలుగురికి విక్రయించారు. ఈ భూమిని విక్రయదారుడు డబుల్ రిజిస్ట్రేషన్ చేయించి జీపీఏ ద్వారా 2013లో పూనం వ్యాస్‌కు, 2014లో పూనం వ్యాస్ సెల్డిడ్ ద్వారా 2014లో అనుపమ వ్యాస్‌కు విక్రయించారు. 2023లో రమేశ్ శర్మ తన అనుచరులతో భూ మాఫియాతో కుమ్మక్కై భూమిని తహసీల్దార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. సర్వే అధికారుల ద్వారా సెత్వార్ తీసుకొని గతేడాది నవంబరు 18న నిందితులు టిప్పర్లతో చదును చేసి భూమిలో ప్రైవేశించి స్వాధీనం చేసుకున్నారు.
2022 ఆర్థిక నేరాల కారణంగా మనోజ్ కుమార్ తనాఖా పెట్టిన భూమిని ఈడీ స్వాధీనం చేసుకోగా.. పోలీసులు రక్షణగా ఉన్నారు. పోలీసులు అడ్డుకోవడానికి ప్రయత్నించగా వారిని బెదిరింపులకు గురి చేశారు. భూమి స్వాధీనంలో ఉన్న అధికారి ఫిర్యాదు మేరకు కలెక్టర్ విచారణ జరిపి రమేశ్ శర్మ రిజిస్ట్రేషన్, సప్లమెంటరీ రిజిస్ట్రేషన్ రద్దు చేయగా, కలెక్టర్ ఆదేశాలతో జత చేస్తూ ఫిర్యాదుదారుడు ఆదిలాబాద్ రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. ఈ కేసులో సప్లమెంటరీ సెత్వార్ ఇచ్చి భూ మాఫియాకు సహకరించిన ఇతర అధికారుల పాత్రపై దర్యాప్తు జరుగుతుందన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women’s Asian Champions Trophy | చైనాపై భారత్ ఘన విజయం.. ఆసియా హాకీ ఛాంపియన్‌గా హ్యాట్రిక్
Child Marriage | టెంకంపేట్లో బాల్యవివాహానికి బ్రేక్.. అధికారుల చొరవతో నిలిపివేత
Begumpet Students | సిద్దిపేట వైజ్ఞానిక ప్రదర్శనలో బేగంపేట విద్యార్థుల ప్రతిభ.. రాష్ట్రస్థాయికి స్మార్ట్ వాకర్ ప్రాజెక్టు
Myanmar military bombs school | స్కూల్‌పై మయన్మార్ ఆర్మీ బాంబు దాడి.. మహిళలు, పిల్లలతో సహా 30 మంది మృతి
ఓబీసీ కులగణన తర్వాతే డీలిమిటేషన్ చేపట్టాలి.. బీసీ మహిళలకు సబ్‌కోటా కల్పించాలి.. జాజుల శ్రీనివాస్ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

