ముగిసిన సీఎంఆర్ గడువు
2022-23 సంవత్సరానికి సంబంధించి కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్) పౌరసరఫరాల సంస్థ (సీఎస్సీ), ఆహార భద్రత సంస్థ (ఎఫ్‌సీఐ)లకు ఇచ్చేందుకు గడువు జనవరి 31వ తేదీతో ముగిసింది.
- పూర్తిస్థాయిలో బియ్యం ఇవ్వని మిల్లర్లు
- ప్రభుత్వ ఆదేశాల మేరకు చర్యలు: డీఎం
మంచిర్యాల అర్బన్, ఫిబ్రవరి 1: 2022-23 సంవత్సరానికి సంబంధించి కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్) పౌరసరఫరాల సంస్థ (సీఎస్సీ), ఆహార భద్రత సంస్థ (ఎఫ్‌సీఐ)లకు ఇచ్చేందుకు గడువు జనవరి 31వ తేదీతో ముగిసింది. 2022-23 వానకాలం సీజన్లో పౌర సరఫరాలశాఖ జిల్లాలోని 19 బాయిల్డ్, 35 రా రైస్ మిల్లులకు 1,19,177 మెట్రిక్ టన్నుల ధాన్యం అలాట్ చేశారు. ఈ ధాన్యాన్ని మిల్లర్లు మిల్లింగ్ చేసి 80,336 మెట్రిక్ టన్నుల బియ్యం సీఎస్సీ, ఎఫ్‌సీఐకి అందజేయాల్సి ఉంటుంది.
కానీ ఇప్పటి వరకు 58,998 మెట్రిక్ టన్నులు బియ్యం పెట్టారు. అంటే మొత్తంగా ఇప్పటి వరకు 73 శాతం బియ్యం మాత్రమే అందించారు. ఇంకా 21,338 మెట్రిక్ టన్నులు బకాయి ఉన్నారు. ఇక యాసంగి సీజన్లో 19 బాయిల్డ్, ఎనిమిది రా రైస్ మిల్లులకు 92,169 మెట్రిక్ టన్నుల ధాన్యం అలాట్ చేశారు. మిల్లింగ్ అనంతరం 62,086 మెట్రిక్ టన్నుల బియ్యం సీఎస్సీ, ఎఫ్‌సీఐకి అందజేయాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు 17,987 మెట్రిక్ టన్నులు (29 శాతం) మాత్రమే పెట్టారు. ఇంకా 44,099 మెట్రిక్ టన్నుల బియ్యం ప్రభుత్వానికి బకాయి ఉన్నారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు చర్యలు
గడువులో సీఎంఆర్‌ను ఇవ్వాలని మొదటి నుంచి ఒత్తిడి తీసుకువచ్చినా మిల్లర్లు నిర్లక్ష్యం చేశారు. వానకాలం 73 శాతం, యాసంగి 29 శాతం బియ్యం మాత్రమే ప్రభుత్వానికి అందించారు. ఇలాంటి వారిపై ప్రభుత్వ ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం. ఇప్పటి వరకు సీఎంఆర్ గడువు పెంచుతున్నట్లు ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాలేదు. – గెడాం గోపాల్, డీఎం సివిల్ సైప్లె కార్పొరేషన్, మంచిర్యాల
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

