త్వరలో ట్రయల్న్.. చివరి దశకు చనాక-కొరాట ప్రాజెక్టు పనులు
తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో గల పెన్‌గంగపై జైనథ్ మండలం కొరాట గ్రామం వద్ద చనాక-కొరాట ప్రాజెక్టు నిర్మాణమవుతున్నది. ఈ ప్రాజెక్టు ద్వారా ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిలాబాద్, భీంపూర్, జైనథ్, బేల మండలాల్లోని 89 గ్రామాల పరిధిలో గల 51 వేల ఎకరాలకు సాగునీరు అందునుంది.
- తుది అనుమతులు మంజూరు చేసిన జలశక్తి మంత్రిత్వ శాఖ
- పూర్తయిన బరాజ్, కాలువలు, పంప్‌హౌస్ పనులు
- ప్రాజెక్టు ద్వారా 51 వేల ఎకరాలకు సాగునీరు
ఆదిలాబాద్, డిసెంబర్ 1(నమస్తే తెలంగాణ) : తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో గల పెన్‌గంగపై జైనథ్ మండలం కొరాట గ్రామం వద్ద చనాక-కొరాట ప్రాజెక్టు నిర్మాణమవుతున్నది. ఈ ప్రాజెక్టు ద్వారా ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిలాబాద్, భీంపూర్, జైనథ్, బేల మండలాల్లోని 89 గ్రామాల పరిధిలో గల 51 వేల ఎకరాలకు సాగునీరు అందునుంది. ప్రధాన కాలువల కోసం ప్రభుత్వం రూ.397.82 కోట్లు మంజూరు చేసింది. రూ.106.71 కోట్లతో పంప్‌హౌస్, లోయర్ పెన్‌గంగ ప్రధాన కాలువ నిర్మాణానికి రూ.234.8 కోట్లు, డిస్ట్రిబ్యూటరీల కోసం రూ.148.43 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇప్పటికే బరాజ్, ప్రధాన కాలువలు, పంప్‌హౌస్ పనులు పూర్తయ్యాయి. 0.83 టీఎంసీల నీటినిల్వ గల బరాజ్‌కు 23 పిల్లర్లతో గేట్లు బిగించారు. సాగు భూములకు నీటిని సరఫరా చేసేందుకు 47 కిలోమీటర్ల మేర ప్రధాన కాలువ నిర్మించాల్సి ఉండగా పనులు పూర్తయ్యాయి. వీటితోపాటు 129 బ్రిడ్జిలు నిర్మించారు. ప్రెసర్ మెయిన్స్‌కు సంబంధించి 4 కిలోమీటర్ల మేర పైపులు వేశారు. పంప్‌హౌస్ నుంచి ప్రెసర్ మెయిన్స్‌కు నీటిని ఎత్తిపోసి.. అక్కడి నుంచి కాలువలకు నీటిని విడుదల చేస్తారు.
జలశక్తి సంఘం అనుమతులు
కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ తుది అనుమతులు మంజూరు చేసింది. తెలంగాణ ప్రభుత్వం గతేడాది సెప్టెంబర్‌లో చనాక-కొరాట ప్రాజెక్టు డీపీఆర్‌ను కేంద్ర జల సంఘానికి, గోదావరి బోర్డుకు అందజేసింది. కేంద్ర జల సంఘంలో భాగమైన వివిధ డైరెక్టరేట్లు డీపీఆర్‌ను పూర్తిస్థాయిలో పరిశీలించి ఆమోదం తెలిపాయి. చనాక-కొరాట ప్రాజెక్టు నిర్మాణం వల్ల నాలుగు మండలాలు సస్యశ్యామలంగా మారనున్నాయి. ఇప్పటికే పనులు చివరి దశకు చేరుకోగా అధికారులు త్వరలో ట్రయల్ రన్‌కు ఏర్పాట్లు చేస్తున్నారు. పంప్‌హౌస్ నిర్మాణంలో గ్రౌండ్ ఫ్లోర్ కింద నాలుగు ఫ్లోర్స్ నిర్మించారు. బరాజ్‌లో నీరు నిలిచి చివరి ప్రాంతం నుంచి మూడు కింద ఫ్లోర్స్‌ను నిర్మించారు. కొరాట వద్ద బరాజ్‌లను నిర్మించగా నాలుగు కిలోమీటర్ల దూరంలో పిప్పల్‌కోటి వద్ద పంప్‌హౌస్ నిర్మాణం జరుగుతున్నది.
నిల్వ ఉన్న నీటిని పంప్‌హౌస్ నుంచి సిస్టర్న్‌కు నీటిని తరలిస్తారు. అక్కడి నుంచి కాల్వల ద్వారా పంట పొలాలకు చేరుతుంది. నీటిని తరలించడానికి పంప్‌హౌస్‌లో మొత్తం ఆరు మోటర్లను బిగించారు. ఇందులో కుడి వైపు కాలువలకు నీటిని తరలించడానికి 3 మోటర్లు 12 మెగావాట్లు.. ఎడమ వైపు నుంచి నీటిని ఎత్తిపోసేందుకు 3 మోటర్లు 5.5 మెగావాట్ల సామర్థ్యం కలిగినవి ఏర్పాటు చేస్తున్నారు. పంప్‌హౌస్‌లోని మోటర్లను నడిపించేందుకు వీలుగా సమీపంలో 132 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌ను నిర్మించారు. నీళ్లను ఎత్తిపోసే సమయంలో మోటర్స్ ఆన్ చేసేలా, తర్వాత ఆఫ్ చేసేలా ప్రత్యేక ప్యానెల్ బోర్డులు బిగించారు. కుడి వైపులో ఏర్పాటు చేసిన పైపుల ద్వారా 3 కిలోమీటర్లు, ఎడమ వైపు పైపుల ద్వారా కిలోమీటరు మేర నీటిని ఎత్తు ప్రాంతంలో ఉన్న సిస్టర్న్‌కు తరలించాల్సి ఉంటుంది. రెండు వైపులా మోటర్లు 111 మీటర్ల ఎత్తు వరకు నీటిని ఎత్తి పోస్తాయి.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | రణబాలి బాక్సాఫీస్ సెన్సేషన్.. వర్కింగ్ డేలోనూ అదరగొట్టిన విజయ్ దేవరకొండ!
Rowdy-sheeter | పోలీసింగ్ ఎక్కడ? ఏం చేస్తారో చేసుకోండన్న యువకుడు
RC 17 | ఆ తేదీన రామ్ చరణ్-సుక్కూ మూవీ ఓపెనింగ్.. ‘ఆర్సీ 17’ మ్యూజిక్ డైరెక్టర్‌పై మైత్రీ నిర్మాత క్లారిటీ!
Bigg Boss 10 | సీక్రెట్ రూమ్ నుంచి గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చిన షాలిని.. ఇంట్రెస్టింగ్ గేమ్‌లో రామ్ ప్రసాద్ విజయం!
Yusuf Pathan | ఎన్డీయేలో చేరిక.. ప్లాట్ కానుక.. ఇంటిపక్క భూమిని యూసుఫ్‌కి కేటాయించిన గుజరాత్ ప్రభుత్వం
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

