నో బడ్జెట్ కరుణించని కేంద్రం
కేంద్ర ప్రభుత్వం 2024-25 సంవత్సరానికి గాను ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. కేంద్ర మంత్రి నిర్మలమ్మ బడ్జెట్ ప్రసంగంలో అసలు తెలంగాణ ప్రస్తావనే రాలేదు. కేంద్ర మంత్రి నిర్మ లా సీతారామన్ రూ.48.20 లక్షల కోట్లతో ప్రవేశపెట్టిన బడ్జెట్లో మనకు పైసా విదల్చలేదు.
- సెంట్రల్ బడ్జెట్లో తెలంగాణ ఊసే లేదు..
- రాష్ర్టానికి పైసా కూడా విదల్చని మోదీ సర్కారు
- సింగరేణి కార్మికులకు ఐటీ మినహాయింపులు లేవు
- పెండింగ్‌లోనే ఆర్మూర్-ఆదిలాబాద్ రైల్వేలైన్
- సీసీఐ, హైదరాబాద్-నాగ్‌పూర్ కారిడార్ ఏర్పాటు వాయిదా పడినట్లే..
- గంపెడాశలు పెట్టుకున్న ఉమ్మడి జిల్లా వాసులకు మిగిలింది నిరాశే..
మంచిర్యాల, జూలై 23(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కేంద్ర ప్రభుత్వం 2024-25 సంవత్సరానికి గాను ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. కేంద్ర మంత్రి నిర్మలమ్మ బడ్జెట్ ప్రసంగంలో అసలు తెలంగాణ ప్రస్తావనే రాలేదు. కేంద్ర మంత్రి నిర్మ లా సీతారామన్ రూ.48.20 లక్షల కోట్లతో ప్రవేశపెట్టిన బడ్జెట్లో మనకు పైసా విదల్చలేదు. దీంతో ఎప్పటిలాగే కేంద్ర బడ్జెట్‌పై గంపెడాశలు పెట్టుకున్న రాష్ట్ర ప్రజలు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావాసులకు మరోసారి నిరాశే మిగిలింది. ప్రతిసారి కొన్ని రాష్ర్టాలకే బడ్జెట్‌ను పరిమితం చేసే కేంద్ర ప్రభుత్వం ఈసారి కూడా అదే చేసింది. మిత్ర పక్షాలున్న రాష్ర్టాలైన ఆంధ్రప్రదేశ్, బీహార్ రాష్ర్టాలకు భారీ కేటాయింపులు చేసింది. బడ్జెట్ సొమ్ము మొత్తాన్ని బీజేపీ పాలిత రాష్ర్టాలు, మిత్ర పక్షాలున్న రాష్ర్టాలకే ఊడ్చి పెట్టింది. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏళ్లుగా పేరుకుపోయిన పెం డింగ్ పనులకు ఈసారైన మోక్షం దక్కలేదు. జిల్లావాసుల ఎదురుచూపులు ఫలించలేదు. రాష్ట్రం నుంచి 8మంది బీజే పీ ఎంపీలను గెలిపిస్తే అందులో ఒకరు ఆదిలాబాద్ నుంచి గెలిచారు. దీంతో ఈసారి ఆదిలాబాద్‌కు నిధులు పక్కాగా వస్తాయనే అంచనా వేశారు. కానీ.. అలాంటిదేమీ జరగలే దు. కేంద్రం ప్రభుత్వం జిల్లా విషయంలో మరోసారి నిర్లక్ష్యంగా వ్యవహరించింది. కేంద్ర పరిధిలోని ప్రాజెక్టులు సంవత్సరాల తరబడి పెండింగ్‌లో ఉన్న వాటికి కూడా నిధులు కేటాయించలేదు. రెండోసారి ఆదిలాబాద్‌లో బీజేపీ ఎంపీని గెలిపించినా కేంద్రం జిల్లా అభివృద్ధిని పట్టించుకోకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సింగరేణికి పన్ను మినహాయింపు లేదు..
సింగరేణి కార్మికులకు ఆదాయ పన్ను(ఐటీ)లో మినహాయింపుపై ఈసారి కచ్చితంగా అనుకూల ప్రకటన వస్తుందనుకున్నారు. బడ్జెట్లో ఇందుకోసం ప్రత్యేక కేటాయింపులు ఉంటాయని భావించారు. ఇప్పటికే కేంద్రం బొగ్గు గనుల ప్రైవేటీకరణకు టెండర్లు పిలుస్తుంది. సింగరేణి కార్మికులకు అన్యాయం జరుగుతుందనే భావన అందరిలోనూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో పన్ను మినహాయింపు కల్పించి కాస్త ఊరట కల్పిస్తుందనుకుంటే మరోసారి నిరాశే ఎదురైందని కార్మికులు మండిపడుతున్నారు. ఏళ్లుగా ఉన్న డిమాండ్‌ను ఈసారి కూడా పరిగణలోకి తీసుకోకపోవడంపై పెదవి విరుస్తున్నారు. సింగరేణిని నాశనం చేయాలన్న ఆలోచనతోనే మోదీ సర్కార్ ఉందని, అందుకే కార్మికుల సంక్షేమాన్ని ప ట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పారిశ్రామిక ప్రాంతంగా ఉత్తర, దక్షిణ భారతదేశానికి రవాణ మార్గంగా ఉన్న మంచిర్యాల మీదు రైళ్ల రవాణాను మెరుగుపరచాల్సి ఉంది. ఈ మేరకు రైళ్ల హాల్టింగ్‌లను పెంచి నూ తన ఆర్వోబీలు, అండర్ బ్రిడ్జిలు పెంచితే రోడ్డు రవాణా సౌకర్యాన్ని మెరుగుపరచాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. కానీ.. ఈసారి కేంద్ర ప్రభుత్వం ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోలేదు. ఇక జిల్లా నుంచి వెళ్తున్న జాతీయ రహదారులు సహా అటవీ, పర్యావరణ అనుమతులు లేక అనేక గ్రామాల్లో రోడ్లు లేవు. కోటపల్లి, వేమనపల్లి, జన్నా రం, చెన్నూర్, ఆసిఫాబాద్ జిల్లాల్లో చాలా గ్రామాల్లో రోడ్లు లేక జనాలు అవస్థలు పడుతున్నారు. ఈసారి బడ్జెట్లో ఈ రోడ్లు నిర్మాణానికి కావాల్సిన అనుమతుల విషయంలో కేంద్రం చొరవ చూపుతుందనుకుంటే అది జరగలేదు.
ఆర్మూర్, ఆదిలాబాద్ రైల్వే లైన్‌కు నిధులేవు..
పాత జిల్లా కేంద్రమైన ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్‌కు రైలులో పోవాలంటే మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల మీదుగా వెళ్లాల్సి వస్తుంది. ఇందుకు గానూ 9 నుంచి 10 గంటల సమయం పడుతుంది. జిల్లా ప్రజలు రైలులో నగరానికి పోయేందుకు కేంద్రం ఏర్పాటుకు 2009-10 రైల్వే బడ్జెట్లో ఆదిలాబాద్ నుంచి పటాన్చెరు వరకు లైన్ మంజూరు చేసింది. నిర్మాణ వ్యయం రూ.3771 కోట్లు భారీగా అవుతుండడంతో తక్కువ ఖర్చతో ఆర్మూర్ లైన్‌ను ఏర్పాటుకు ముందుకు వచ్చింది. ఆదిలాబాద్ నుంచి నిర్మల్ మీదుగా ఆర్మూర్ వరకు లైన్ వేస్తే అక్కడి నుంచి నిజామాబాద్ మీదుగా హైదరాబాద్‌కు రైలులో పోయే అవకాశాలున్నాయి. దీంతో 2017 బడ్జెట్లో ఆదిలాబాద్-ఆర్మూర్ లైన్‌కు మంజూరు లభించింది. లైన్ సర్వే నిర్వహించిన అధికారులు రూ.2990 కోట్లు ఖర్చవుతాయని అంచనాలు వేశారు. ఈ రైల్వే లైన్‌కు కేంద్రం నిధులు కేటాయిస్తుందని జిల్లావాసులు ప్రతి బడ్జెట్లో ఎదురు చూస్తున్న నిరాశే కలుగుతుంది. ఈ బడ్జెట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రైల్వేలైన్ విషయంలో ఉసేత్తలేదు.
సీసీఐ ఊసే లేదు..
మూతపడిన ఆదిలాబాద్ సిమెంటు పరిశ్రమను పునః ప్రారంభించడానికి అన్ని అవకాశాలున్నా కేంద్ర ప్రభుత్వం మాత్రం కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతుంది. ప్రస్తుతం సిమెంటు రంగానికి మంచి డిమాండ్ ఉండగా పరిశ్రమ ప్రారంభానికి అన్ని సౌకర్యాలు ఉన్నాయి. జాతీయ రహదారి 44కు సమీపంలో పరిశ్రమ భూములు, సిమెంటును తరలించడానికి ఆదిలాబాద్ నుంచి రైలు, మహారాష్ట్రతోపాటు ఇతర ఉత్తరాది రాష్ర్టాలకు రోడ్డు మార్గం ఉంది. 772 ఎకరాల భూములు, 170 ఎకరాల్లో టౌన్షిప్, 48 మిలియన్ టన్నుల లైమ్‌స్టోన్ నిల్వలు అందుబాటులో ఉన్నాయి. పరిశ్రమకు అవసరమైన విద్యుత్‌తోపాటు నీటి వనరులు ఉన్నాయి. సిమెంటు తయారీకి అపారమైన వనరులు ఉన్నా కేంద్ర ప్రభుత్వం మొండివైఖరి వీడనాడడం లేదు. సిమెంటు పరిశ్రమను ప్రారంభించాలని అఖిలపక్షం నాయకులు ఆందోళనలు చేసినా ఫలితం లేదు. గతంలో కేంద్ర మంత్రులు అమిత్‌షా, హన్స్‌రాజ్ గంగారాంలు సీసీఐని ప్రారంభిస్తామని హామీలు ఇచ్చినా ఫలితం లేదు. ఈ బడ్జెట్లో ఎలాంటి కేటాయింపులు లేవు. ఉడాన్ పథకం కింద ద్వితీయ శ్రేణి నగరాలకు విమానాలను నడిపేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్‌లో సైతం విమానాశ్రయం ఏర్పాటుకు అవకాశాలున్నాయని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయాలని ఎయిర్‌పోర్టు ఆధారిటీ ఆఫ్ ఇండియాను కోరింది. జిల్లాలో పర్యటించిన అధికారుల బృందం ఎయిర్‌పోర్టు మైదానాన్ని పరిశీలించి సానుకూలంగా నివేదికలు అందజేసింది. కానీ.. విషయాన్ని బీజేపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. హైదరాబాద్- ఆదిలాబాద్ జాతీయ రహదారి జిల్లాలో 80 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. నేషనల్ హైవేకు ఇరువైపుల ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి. జిల్లాలో ముడిసరుకు లభ్యమయ్యే వస్త్ర, వివిధ రకాల పంటల ఉత్పత్తులు, ఇతర పరిశ్రమల ఏర్పాటుకు అవకాశం ఉంది. ఇది వస్తే ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధిలో దూసుకుపోతుంది. కానీ.. కారిడార్ ఏర్పాటును కేంద్ర మంత్రి బడ్జెట్లో ప్రస్తావించలేదు. ఉమ్మడి జిల్లాకు సంబంధించిన కీలక హామీలను నెరవేర్చుకునే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేయకపోవడంపై పలు వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
బీజేపీ, కాంగ్రెస్‌లు మోసం చేశాయి
శ్రీరాంపూర్, జూలై 23 : సింగరేణి కార్మికులకు ఐటీ రద్దు చేయిస్తామని మాయ మాటలు చెప్పిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మోసం చేశాయి. 2024-25 బడ్జెట్ సమావేశంలో నామమాత్రంగా ఆదా యపు పన్ను స్లాబ్‌లను సవరించాయి. కార్మికుల 12 నెలల వేతనాల్లో మూడు నెలల వేతనాలు ఆదాయపు పన్ను కోతకే సరిపోతున్నాయి. కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు పార్లమెంటులో కనీసం గళం ఎత్తకపోవడం విడ్డూరం.
– సురేందర్‌రెడ్డి, టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి.
కార్మికులకు ఒరిగింది ఏమి లేదు..
రెబ్బెన, జూలై 23 : కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్లో సింగరేణి కార్మికులకు ఒరిగింది ఏమి లేదు. ఆదాయపన్నును మినహాయిస్తారను కుంటే మళ్లీ నిరాశే మిగిలింది. అంకెల గారడీ చేసి పన్ను స్లాబులు అటుది ఇటుగా ఇటుది అటుగా మార్చడం తప్పా ఏ ఒక్క కార్మికుడికి కూడా రూపాయి తగ్గదు. ఈ విషయంపై టీబీజీకేఎస్ యూనియన్ తీవ్రంగా ఖండిస్తుంది.
– మల్రాజు శ్రీనివాసరావు, టీబీజీకేఎస్ బెల్లంపల్లి ఏరియా ఉపాధ్యక్షుడు.
తెలంగాణ ఎంపీల వైఫల్యం
బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు మొండిచేయి చూపింది. రాష్ర్టానికి నిధులు తీసుకురావడంతో బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు పూర్తిగా విఫలమయ్యారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక విభజన హామీల పేరిట ఏపీకి రూ.15 వేల కోట్లు ఇచ్చినప్పుడు, కొత్తగా ఏర్పడిన మన రాష్ర్టానికి ఎందుకు ఇవ్వలేదు. బీహార్ రాష్ర్టానికి వరద నివారణ పేరిట రూ.11,500 కోట్లు ఇచ్చారు. గోదావరి పరీవాహక ప్రాంతంలో ఉన్న తెలంగాణ రాష్ర్టానికి అంత మొత్తంలో నిధుల అవసరం ఉంది. అలా నిధులిస్తే మంచిర్యాల ముంపు ప్రాంత ప్రజలకు మేలు జరిగేది. కానీ.. మనకు ఇవ్వలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నీటిపారుదల ప్రాజెక్టులకు డబ్బులు ఇచ్చి మన రాష్ట్రంలో ఒక్క ప్రాజెక్టుకు ఇవ్వలేదు. జాతీయ రహదారుల కోసం కేంద్ర కేటాయించిన రూ.24 వేల కోట్లతో తెలంగాణకు ఎక్కువ నిధులు తేవాల్సిన బాధ్యత ఇప్పుడున్న ఎంపీలపై ఉంది. ఏదీ ఏమైనా ఈ బడ్జెట్లో తెలంగాణకు తీవ్రమైన అన్యాయం జరిగింది.
– నడిపెల్లి దివాకర్‌రావు, మాజీ ఎమ్మెల్యే, మంచిర్యాల.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

