Home
Adilabad
Brs Adilabad Mp Candidate Atram Sakku Performed Special Pooja At Keslapur Nagoba Temple
నాగోబా ఆలయంలో ఆత్రం సక్కు పూజలు
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ నాగోబా ఆలయంలో బీఆర్ఎస్ ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు శుక్రవారం ప్రత్యేక పూజలు చేశారు. ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాగోబా ఆలయ అభివృద్ధికి పెద్దపీట వేసినట్లు గుర్తు చేశారు.
ఆసిఫాబాద్, మార్చి 22 : ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ నాగోబా ఆలయంలో బీఆర్ఎస్ ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు శుక్రవారం ప్రత్యేక పూజలు చేశారు. ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాగోబా ఆలయ అభివృద్ధికి పెద్దపీట వేసినట్లు గుర్తు చేశారు. ఆదివాసుల సంసృతీ సంప్రదాయాలను గౌరవించిన వ్యక్తి కేసీఆర్ అని కొనియాడారు.
రాబోయే ఎన్నికల్లో తనను ఎంపీగా గెలిపిస్తే ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. మీ బిడ్డగా ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు శాలువాతో ఆయనను ఘనంగా సతరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఆదివాసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

