నిప్పును నిర్లక్ష్యం చేస్తే పెను ముప్పు
అగ్ని ఎన్నో విధాలా మనకు ఉపయోగపడుతున్నప్పటికీ.. ఏమాత్రం పొరపాటు చేసినా ప్రాణ, ఆస్తి నష్టం కలిగిస్తుందన్నది అక్షర సత్యం. ఈ నేపథ్యంలో ఈ నెల 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నిర్వహిస్తున్న అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సిబ్బంది అవగాహన కల్పిస్తున్నది.
- అప్రమత్తత.. ముందు జాగ్రత్తలే మేలు
- కొనసాగుతున్న అగ్ని మాపక వారోత్సవాలు
- ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమాలు
- అగ్ని ప్రమాదాలకు : డయల్ 101
- ఎల్పీజీ గ్యాస్ సహాయానికి : 1906
నిప్పును నిర్లక్ష్యం చేస్తే పెనుముప్పు తప్పదు. ఏదైనా అంటుకుంటే చాలు కళ్లు మూసి తెరిచేలోగా కాలిబూడిదవుతుంది. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలంటూ అగ్నిమాపక శాఖ హెచ్చరిస్తున్నది. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా ప్రమాదాల నివారణపై అవగాహన కల్పిస్తున్నది. గోడ పత్రికల ద్వారా విస్తృతంగా ప్రచారం చేస్తూనే మాక్ డ్రిల్స్వంటివి నిర్వహిస్తూ చైతన్యవంతులను చేస్తున్నది.
– చెన్నూర్ టౌన్, ఏప్రిల్ 18
చెన్నూర్ టౌన్, ఏప్రిల్ 18 : అగ్ని ఎన్నో విధాలా మనకు ఉపయోగపడుతున్నప్పటికీ.. ఏమాత్రం పొరపాటు చేసినా ప్రాణ, ఆస్తి నష్టం కలిగిస్తుందన్నది అక్షర సత్యం. ఈ నేపథ్యంలో ఈ నెల 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నిర్వహిస్తున్న అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సిబ్బంది అవగాహన కల్పిస్తున్నది. గోడ పత్రికల ద్వారా విస్తృతంగా ప్రచారం చేస్తూనే.. బాలబాలికలకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు, మాక్ డ్రిల్స్ వంటివి నిర్వహిస్తున్నది.
వారోత్సవాల ఉద్దేశం..
1944 ఏప్రిల్ 14న బాంబే పోర్టులో విక్టోరియా పడవలో జరిగిన అగ్ని ప్రమాదంలో 66 మంది అగ్నిపమాక సిబ్బంది మృతి చెందారు. అప్పటి నుంచి యేటా ఏప్రిల్ 14న అగ్నిమాపక శాఖ అధికారులు వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. అదేరోజు ప్రమాదాల్లో మృతి చెందిన అగ్నిమాపక సిబ్బందికి నివాళులర్పిస్తుంటారు. కర్తవ్య నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అగ్నిమాపక సిబ్బందికి జోహార్లు అర్పించడం, వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించడం, అగ్ని ప్రమాదాలు జరగకుండా ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించడం ఈ వారోత్సవాల ముఖ్య ఉద్దేశం. అగ్ని ప్రమాద సమయాల్లోనేగాకుండా వరదలు, రోడ్డు, రైలు, భూకంపాల వంటి ప్రమాదాల్లోనూ సంబంధిత శాఖ సేవలందిస్తున్నది. ప్రమాదాలు, ప్రకృతి వైపరీత్యాల్లో ప్రాణనష్టం జరగకుండా కాపాడడమే వీరి ప్రధాన కర్తవ్యం. ఏదైనా ప్రమాదం సంభవించినపుడు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించాలి. పేరు, ఫోన్ నంబర్, ప్రమాదం జరిగిన ప్రదేశం గురించి సంబంధిత శాఖకు వివరంగా తెలపాలి.

అగ్నిప్రమాద నివారణ పద్ధతులు..
- ఇంటిలోని వస్తువులను అల్మారాలు, సెల్పుల్లో సక్రమం గా ఉంచాలి. ఇంటిని పరిశుభ్రంగా ఉంచాలి.
- చిన్న పిల్లలకు అగ్గిపెట్టెలు, లైటర్లు, పటాకులు, ఇతర మండే పదార్థాలను అందుబాటులో ఉంచవద్దు.
- కాల్చిన సిగరెట్లు, బీడీలు, అగ్గిపుల్లలు ఆర్పకుండా పడేయవద్దు.
- ఐఎస్ఐ ఎలక్ట్రికల్ వైరింగ్ పరికరాలనే ఉపయోగిం చాలి.
- పాడైన వైర్లను వాడవద్దు. ఓవర్ లోడ్ వేయ వద్దు. ఎలక్ట్రికల్ సాకెట్లో దాని సామర్థ్యానికి తగిన ప్లగ్నే వాడాలి.
- బెడ్ మీద పడుకొని పొగ తాగవద్దు. ఇంటి నుంచి ఎక్కువ రోజులు బయటికి వెళ్లినపుడు ఎలక్ట్రికల్ మెయిన్ ఆఫ్ చేయాలి.
- పటాకులు కాల్చేటప్పుడు ఎలక్ట్రికల్ నైలాన్, పాలిస్టర్ దుస్తులు ధరించవద్దు.
- ప్రమాదవశాత్తు, అగ్నిప్రమాదం జరిగితే ఆర్పేందుకు ఎల్లవేళలా నీటిని ఇంట్లో నిలువ చేయాలి.
వంటింట్లో..
- వంటింటి కింది, పై భాగాల్లో గాలి, వెలుతురు ఉండేట్లు చూడాలి.
- చిన్న పిల్లలను అజాగ్రత్తగా వంట గదుల్లో వదలరాదు.
- చెడిపోయిన గ్యాస్ ట్యూబ్‌ను ఐఎస్ఐ మార్కు గల కొత్త ట్యూబ్‌తో వెంటనే మార్చాలి.
- ఎల్పీజీ వాడకం పూర్తయిన వెంటనే రెగ్యులేటర్ వాల్వు ఆపివేయాలి.
- గ్యాస్ లీకవుతున్నట్లు అనుమానం వస్తే వెంటనే రెగ్యులేటర్ వాల్వు ఆపివేయాలి. అటువంటి సమయంలో ఎలక్ట్రికల్ స్విచ్‌లు ఆన్, ఆఫ్ చేయవద్దు.
- మండుతున్న స్టవ్‌లో కిరోసిన్ పోయవద్దు.
- వంట గదిలో కిరోసిన్, డీజిల్, పెట్రోల్, అదనపు గ్యాస్ సిలిండర్వంటివి ఉంచవద్దు.
- వంట చేస్తున్నప్పుడు సరైన నూలు వస్ర్తాలు, ఏప్రాన్ గాని ధరించాలి.
ఇతర జాగ్రత్తలు..
- దుస్తులకు నిప్పు అంటుకుంటే పరుగెత్త వద్దు. నేలపై దొర్లాలి. లేదా దుప్పటి చుట్టుకోవాలి.
- కాలిన శరీర భాగం మీద చల్లని నీరు పోయాలి.
- పొగతో నిండిన గదుల్లో మోచేతులు, మోకాళ్లపై పాకాలి. ముక్కుకు, నోటికి అడ్డంగా తడిగుడ్డ నుంచి గాలి పీల్చడం ద్వారా పొగ, కార్బన్ డై ఆక్సైడ్ పీల్చకుండా ఆపవచ్చు.
స్కూల్స్, హాస్పిటల్స్, షాపింగ్ మాల్స్‌లలో..
- స్కూల్స్, షాపింగ్ మాల్స్, హాస్పిటల్స్‌లో ఆర్సీసీ లేదా కాంక్రీట్ శ్లాబులను మాత్రమే పైకప్పుగా వాడాలి.
- ఫైర్ అలారం, ఫైర్ స్మోక్ డిటెక్టర్లను అవసరమైన ప్రదేశాల్లో ఏర్పాటు చేసుకోవాలి.
- సెల్లార్లలో ఆటోమెటి క్ స్ప్రింక్లర్స్‌ను ఉపయోగించాలి.
- స్కూల్స్‌లో, హాస్పిటల్స్‌లో అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు క్షేమంగా తప్పించుకునేందుకు సరైన ప్రణాళికను రచించి అది అందరికీ తెలిసేలా తగు ప్రదేశాల్లో ఉంచాలి.
- షాపింగ్ మాల్స్ల్లో ఎలక్ట్రికల్ సామగ్రిని ఐఎస్ఐ మార్కు కలిగిన వాటిని మాత్రమే వాడాలి.
- హాస్పిట ల్స్, స్కూల్స్ వద్ద బయటికి వెళ్లే మార్గాల్లో (మెట్లు, తలుపుల వద్ద) ఎటువంటి ఆటంకాలు లేకుండా చూడాలి.
- తాటాకులు, గడ్డితో చేసిన పైకప్పును స్కూల్స్, హాస్పిటల్స్ నందు వాడవద్దు.
- ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ జరిగినప్పుడు అగ్ని ప్రమాదం సంభవించ కుండా మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్స్‌ను అమర్చాలి.
- పరిసరాల శుభ్రతను పాటించాలి. ఆవరణల్లో చెత్తాచెదా రం లేకుండా చూడాలి.
- అగ్ని ప్రమాదం జరిగేందుకు ఆస్కారం ఉన్న ప్రదేశాలను ముందుగా గుర్తించి ఆ ప్రాంతాలను అగ్ని ప్రమాద రహితం చేయాలి.
- పటాకులు కాల్చేటపుడు నైలాన్, పాలిస్టర్ దుస్తులు ధరించవద్దు.
- ఫ్లేమ్ ప్రూఫ్ మోటర్ స్పార్క్ స్విచ్‌లను మాత్రమే ఉపయోగించాలి.
- స్కూల్స్, హాస్పిటల్స్, షాపింగ్ మాల్స్‌లో అగ్ని ప్రమాదాలను అరికట్టేందుకు సరిపడే నీటిని, ఫిక్స్డ్ ఫైర్ ఫైటింగ్ వస్తువులను నిబంధనల మేరకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంచుకోవాలి.
- ఫైర్ ఎనాక్యుయేషన్ డ్రిల్లును ప్రతి మూడు నెలలకోసారి క్రమం తప్పకుండా ప్రాక్టీసు చేయాలి.
పౌరులు, సంబంధీకుల పాత్ర..
- విద్యుత్ ప్రమాదాలపై నీటిని ఉపయోగించరాదు. పొడి ఇసుకను మాత్రమే వాడాలి.
- అగ్ని ప్రమాదం సంభవించినపుడు ప్రథమంగా మెయిన్ స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత సంబంధిత ఫైర్‌ను ఆర్పేందుకు ప్రయత్నించాలి.
- విద్యుత్ ప్రవహిస్తున్న తీగలపై అత్యవసర పరిస్థితుల్లో కార్బన్ డై ఆక్సైడ్ ఎక్స్ట్వింగిషర్ను ఉపయోగించాలి.
- అగ్ని ప్రమాద స్థలంలో అగ్ని ప్రమాద సిబ్బందికి సహకరించాలి.
అగ్ని ప్రమాదాలను అరికడదాం..
అగ్ని ప్రమాదాలను అరికట్టి, జాతి సంపదను కాపాడేందుకు కృషి చేద్దాం. అగ్ని ప్రమాదాలు సంభవిస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రమాదాలు జరగకుండా చేపట్టాల్సిన చర్యలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నాం. స్కూల్స్, హాస్పిటల్స్, షాపింగ్ మాల్స్, గోదాములు, కర్మాగారాల్లో అగ్ని ప్రమాదం జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై వివరిస్తున్నాం. అగ్ని ప్రమాదం జరిగితే వెంటనే 101కు సమాచారం అందించాలి. ముఖ్యంగా వంట గ్యాస్ లీకైతే వెంటనే రెగ్యులేటర్ వాల్వు ఆపివేయాలి. ఎల్పీజీ గ్యాస్‌కు సంబంధించిన ఎలాంటి సహాయానికైనా 1906కు కాల్ చేయాలి. అగ్ని ప్రమాదాల సమయంలో పౌరులు కూడా సహకరించాలి.
– కడెం రాజేందర్, చెన్నూర్ ఫైర్ సెక్షన్ ఆఫీసర్, అగ్నిమాపక కేంద్రం, చెన్నూర్.
విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నాం..
అగ్ని ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై ప్రజలకు విస్తృతంగా వివరిస్తున్నాం. చెన్నూర్ పట్టణంలోని పలు కాలనీల్లో తిరుగుతూ మాక్ డ్రిల్ చేసి చూపిస్తున్నాం. ప్రమాదాలు సంభవించినప్పుడు ఎలా స్పందించాలి? ప్రాణాలు కాపాడుకునేందుకు చేపట్టాల్సిన అంశాల గురించి తెలుపుతున్నాం. ఇప్పటికే కరపత్రాలు, గోడ ప్రతులు, మాక్ డ్రిల్ ద్వారా విరివిగా ప్రచారం చేశాం. ప్రజల సహకారం ఉంటేనే ప్రమాదాల నివారణపై చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. యేటా ఏప్రిల్‌లో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం.
– గూడ మధూకర్, డ్రైవర్ కం ఆపరేటర్, అగ్నిమాపక కేంద్రం, చెన్నూర్.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RRR | రీజినల్ రింగ్ రోడ్ ఉత్తర భాగానికి కేంద్రం బ్రేక్.. ప్రస్తుత అలైన్మెంట్తో ప్రాజెక్టుకు ఆమోదం కష్టమే!
Congenital Birth: ఒడిశాలో రెండు తలలతో పుట్టిన మగ శిశువు
Mithun Chakraborty | ‘జైలర్ 2’లో రజనీకాంత్‌కు మిథున్ చక్రవర్తి కండీషన్.. విలన్ పాత్రకు ఓకే చెప్పడానికి అదే కారణమా?
Raja Saab | ‘రాజా సాబ్’ ఫ్లాప్‌కు అదే ప్రధాన కారణం.. తొలిసారి అసలు విషయం చెప్పిన నిర్మాత టీజీ విశ్వప్రసాద్!
Pope Leo XIV: పోప్ లియోకు ఊపిరితిత్తుల క్యాన్సర్.. సర్జరీతో కణితి తొలగింపు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

