మేమెట్లా బతికేది దేవుడా..!
జీవనాధారమైన గొర్రెలు వరిధాన్యం తిని మృత్యువాత పడగా, ఆయా కుటుంబాలు గుండెలవిసేలా రోదించాయి. ‘అయ్యో దేవుడా.. ఎంత పనాయే.. మేమెట్లా బతికేది’ అంటూ కన్నీరు పెట్టుకున్న తీరు అక్కడున్న వారిని కలచివేసింది. మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలం సుద్దాల గ్రామానికి చెందిన గానవేన పోచయ్య, తుర్కపల్లి గ్రామానికి చెందిన బట్టి శ్రీశైలం, అక్కల పోచయ్యకు చెందిన గొర్రెలు శనివారం మేతకు వెళ్లి వరి ధాన్యం తిన్నాయి.
- ధాన్యం తిని 40 గొర్రెలు మృతి
- మరో పదిహేడింటికి అస్వస్థత
- కన్నీరుమున్నీరైన బాధితులు
చెన్నూర్ రూరల్, నవంబర్ 30 : జీవనాధారమైన గొర్రెలు వరిధాన్యం తిని మృత్యువాత పడగా, ఆయా కుటుంబాలు గుండెలవిసేలా రోదించాయి. ‘అయ్యో దేవుడా.. ఎంత పనాయే.. మేమెట్లా బతికేది’ అంటూ కన్నీరు పెట్టుకున్న తీరు అక్కడున్న వారిని కలచివేసింది. మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలం సుద్దాల గ్రామానికి చెందిన గానవేన పోచయ్య, తుర్కపల్లి గ్రామానికి చెందిన బట్టి శ్రీశైలం, అక్కల పోచయ్యకు చెందిన గొర్రెలు శనివారం మేతకు వెళ్లి వరి ధాన్యం తిన్నాయి.
దీంతో 40 గొర్రెలు మృతి చెందగా, మరో 17 గొర్రెలు అస్వస్థతకు గురయ్యాయి. జిల్లా పశువైద్యాధికారి శంకర్, ఆస్నాద్, కత్తెరశాల పశువైద్యాధికారులు శ్రీనివాస్, సతీశ్ అక్కడికి చేరుకొని చికిత్స అందిస్తున్నారు. పీఏసీఎస్ చైర్మన్ చల్ల రాంరెడ్డి, యాదవసంఘం నాయకులు ఈర్ల మల్లికార్జున్ బాధితులను పరామర్శించారు. గొర్రెలు మృతి చెందడంతో తమ బతుకులు రోడ్డున పడ్డాయని, ప్రభుత్వం ఆదుకోవాలని యాజమానులు వేడుకుంటున్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
- Tags
- eating grain
- Sheeps
- sheeps die
RELATED ARTICLES
తాజా వార్తలు
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్‌కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
Punjab Drug | పంజాబ్‌లో పిజ్జా కన్నా వేగంగా డ్రగ్స్ డెలివరీ.. ఆప్, బీజేపీపై సచిన్ పైలట్ ధ్వజం
Chiranjeevi | మూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. వైజాగ్‌లో చిరంజీవి నయా ప్లాన్..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

