వేణు తొట్టెంపూడి గుర్తున్నాడా ?
వేణు తొట్టెంపూడి గుర్తున్నాడా ? అప్పట్లో తనదైన కామెడీతో ఫ్యామిలీ ఆడియన్స్‌లో ఎంతో క్రేజ్ తెచ్చుకున్న ఈ హీరో సడెన్‌గా ఇండస్ట్రీని వదిలేశారు.

వేణు తొట్టెంపూడి గుర్తున్నాడా ? అప్పట్లో తనదైన కామెడీతో ఫ్యామిలీ ఆడియన్స్‌లో ఎంతో క్రేజ్ తెచ్చుకున్న ఈ హీరో సడెన్‌గా ఇండస్ట్రీని వదిలేశారు. 1999లో వచ్చిన స్వయంవరం సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన వేణు.. తొలి సినిమాతోనే నంది స్పెషల్ జ్యూరీ అవార్డు అందుకున్నాడు.

ఆ తర్వాత చిరునవ్వుతో, హనుమాన్ జంక్షన్, కళ్యాణ రాముడు, పెళ్లాం ఊరెళితే, ఖుషీ ఖుషీగా.. ఇలా సుమారు 26 సినిమాల్లో నటించారు. వీటిలో దాదాపు 15 సినిమాలు విజయం సాధించడం విశేషం.

కెరీర్లో ఎక్కువ శాతం హిట్లే అందుకున్న వేణు తొట్టెంపూడి 2009లో వచ్చిన గోపి గోపిక గోదావరి సినిమా తర్వాత బ్రేక్ తీసుకున్నాడు.

అప్పటికే కెరీర్ డల్ కావడంతో ఎన్టీఆర్, బోయపాటి కాంబినేషన్లో 2012లో వచ్చిన దమ్ము సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించాడు. కానీ ఆ సినిమా పెద్దగా ఆడలేదు. ఆ తర్వాత రామాచారి సినిమా చేసినా అది కూడా పరాజయం పాలైంది. అదే సమయంలో వ్యాపార కార్యకలాపాల్లో బిజీ కావడంతో సినిమాలకు పూర్తిగా దూరమయ్యాడు.

2013లో సినిమాలకు పూర్తిగా దూరమైన వేణు తొట్టెంపూడి.. గత లోక్‌సభ ఎన్నికల్లో ఆయన బావ నామా నాగేశ్వరరావు కోసం టీఆర్ఎస్ తరఫున ఖమ్మం నియోజకవర్గంలో ప్రచారం కూడా నిర్వహించారు.

గత ఏడాది లాక్డౌన్ సమయంలో ఉపాధి కోల్పోయిన పేదలకు తోచిన సాయం చేసి తన ఉదారతను చాటుకున్నారు.

జూన్ 4న వేణు తొట్టెంపూడి పుట్టిన రోజు సందర్భంగా ఆయన ఫొటోలు మీకోసం..
వేణు తొట్టెంపూడి Rare Photos :
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చూడండి..
మహేశ్ బాబు సినిమాలో వకీల్‌సాబ్ భామ నివేదా థామస్ ?
సైలెంట్‌గా పెళ్లిపీటలెక్కిన ప్రణీత
Anasuya bharadwaj latest photos
Rashmi Gautam Sizzles in Black Saree
Anchor Vishnu Priya Latest Photoshoot
Anchor Sreemukhi Latest Photos
Read Today's Latest Actors News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!






















