హైదరాబాద్: పీజీ మెడికల్ (PG Medical) కన్వీనర్ కోటా భర్తీకి కాళోజీ హెల్త్ యూనివర్సిటీ (Kaloji health university) రెండో విడుత నోటిఫికేషన్ విడుదల చేసింది. కాళోజీ హెల్త్ యూనివర్సిటీ పరిధిలోని కళాశాలలతోపాటు నిమ్స్ మెడికల్ కళాశాలలోని కన్వీనర్ కోటా సీట్లను భర్తీ చేయనున్నట్టు అధికారులు వెల్లడించారు. తుది మెరిట్ జాబితాలో అర్హత సాధించిన అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని సూచించారు.
ఈ నెల 19న ఉదయం 8 నుంచి 21వ తేదీ మధ్యాహ్నం 2 వరకు ప్రాధాన్యతా క్రమంలో కళాశాలల వారీగా వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలన్నారు. వివరాలకు వర్సిటీ వెబ్సైట్ www.knruhs. telangana.gov.in చూడవచ్చని తెలిపారు.