బద్ధకానికి విరుగుడు
మలబద్ధ్దకం సకల రోగాలకూ కారణం. మలబద్ధ్దకాన్ని జయిస్తే రుగ్మతలను గెలిచినట్లే.శరీరానికి కావాల్సిన శక్తిని, జీవక్రియకు అవసరమైన పోషకాలను, దేహానికి అందాల్సిన నీటిని జీర్ణవ్యవస్థే అందిస్తుంది. ‘సాఫీగా’ పనిచేసే ఆ వ్యవస్థను అస్తవ్యస్తం చేసేదేమలబద్ధ్దకం.
మలబద్ధ్దకం సకల రోగాలకూ కారణం. మలబద్ధ్దకాన్ని జయిస్తే రుగ్మతలను గెలిచినట్లే.శరీరానికి కావాల్సిన శక్తిని, జీవక్రియకు అవసరమైన పోషకాలను, దేహానికి అందాల్సిన నీటిని జీర్ణవ్యవస్థే అందిస్తుంది. ‘సాఫీగా’ పనిచేసే ఆ వ్యవస్థను అస్తవ్యస్తం చేసేదేమలబద్ధ్దకం. ఇది శరీరాన్ని కుళ్లబొడవడమే కాదు మానసికంగానూ కుంగదీస్తుంది.మలబద్ధకానికి అనేక కారణాలు.. నీళ్లు తక్కువగా తాగడం, సమతులాహార లోపం, వేళకు తినకపోవడం, కొన్నిరకాల మందుల దుష్ప్రభావం, వివిధ వ్యాధుల ఫలితం.ఆహారపు అలవాట్లతో ఈ సమస్యను కొంతమేర నివారించవచ్చు.
రాస్బెర్రీ
రాస్బెర్రీ జీర్ణక్రియను పెంచుతుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది.
నారింజ
నిమ్మ జాతికి చెందిన నారింజలో విటమిన్-సితోపాటు పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. నారింజ రసంలో ‘నారింగెనిన్’ అనే ఫ్లేవనాయిడ్ ఉంటుంది. ఇది మంచి విరేచనకారి.
కివీ
ఇందులో పీచు పదార్థాలు, నీరు అధికంగా ఉంటాయి. పేగు గోడల కదలికలను మెరుగుపరుస్తాయి.
ఫిగ్
ఇందులోని ఫైబర్ మల బద్ధకానికి సహజమైన మందుగా పనిచేస్తుంది. పేగు గోడలను మృదువుగా ఉంచుతుంది.
అరటి
అరటిలో పొటాషియం, ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. ఇవి జీర్ణక్రియను పూర్వస్థితికి తెస్తాయి. అరటి జీర్ణకోశ వ్యాధులను తగ్గిస్తుంది. డయేరియా (అతిసార వ్యాధి) నియంత్రణకు ఉపయోగపడుతుంది. బాగా పండిన అరటిపండ్ల్లు విరేచనకారిగా పనిచేస్తాయి.
యాపిల్
పెక్టిన్ ఫైబర్ అధికంగా ఉండే యాపిల్‌ను తీసుకోవడం వల్ల మలబద్ధకం నుంచి ఉపశమనం లభిస్తుంది. విరేచనం సాఫీగా సాగేందుకు .. పేగుల్లో కదలికలను ఈ ఫైబర్ ప్రేరేపిస్తుంది.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
- Tags
- zindhagi news
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

