ఆరుణ్య పర్వం!
‘మనం తయారు చేసిన వస్తువులను పట్నవాసులూ, పరదేశీయులూ ఎందుకు కొంటారు? కాబట్టే పెట్టిన పెట్టుబడి రాదు. పడిన కష్టం రాదు.
‘మనం తయారు చేసిన వస్తువులను పట్నవాసులూ, పరదేశీయులూ ఎందుకు కొంటారు? కాబట్టే పెట్టిన పెట్టుబడి రాదు. పడిన కష్టం రాదు. అయ్యేది కాదు. పొయ్యేదీ లేదు’ అంటూ స్థానిక మహిళలు నిరాశలో కొట్టుమిట్టాడుతున్న సమయంలో బలమైన భరోసా ఇచ్చింది.. ‘ఆరుణ్య’. దాదాపు 300 మంది మహిళలు ఆ ఆసరాతో తమ ఉత్పత్తులను విక్రయించుకుంటున్నారు. నారాయణ పేట జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన ఆలోచనల్లోంచి పుట్టిన ‘బ్రాండ్ నారాయణపేట’ గ్రాండ్ సక్సెస్ స్టోరీ చదవండి..

సృజన మహిళల సొత్తు. ఆ చేతులు అద్భుతాలు చేస్తాయి. కళాఖండాలను సృష్టిస్తాయి. వాళ్లకు కావలసిందల్లా.. ప్రోత్సాహం, సాంకేతిక సాయం. ఆరుణ్య ఆవిర్భావ లక్ష్యమూ ఇదే. నారాయణపేట జిల్లాలోని స్వయం సహాయక సంఘాల మహిళలు తాము తయారు చేసిన వస్తువులను తామే విక్రయించుకుని ఆర్థికంగా స్థిరపడాలనే లక్ష్యంతో ఈ సంస్థ ఏర్పాటైంది. ఆది నుంచీ జిల్లా కలెక్టర్ హరిచందన అన్నీతానై అండగా నిలిచారు. దాదాపు రెండేండ్ల క్రితం.. 2020 అక్టోబర్ 20న ఆరుణ్య ఆరంభమైంది. జిల్లాలోని 11 మండలాలకు చెందిన 300 మందికిపైగా స్వయం సహాయక సంఘాల మహిళలు ఇందులో సభ్యులు. ఓ పది మందిని బోర్డ్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌గా నియమించుకున్నారు. వీరు ప్రతినెలా సమావేశమై ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు.
ఆఫ్‌లైన్, ఆన్లైన్ విక్రయాలు
వివిధ చేతి వృత్తులవారు తయారు చేసిన వస్తువులను ‘ఆరుణ్య’ బ్రాండ్‌తో ఆఫ్ లైన్లో, ఆన్లైన్లో విక్రయిస్తారు. ఆఫ్‌లైన్ అమ్మకాల కోసం నారాయణపేట బస్టాండ్ సమీపంలో ఓ దుకాణం ఉంది. కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఫ్లిప్‌కార్ట్, కలగుడి తదితర ఇ-కామర్స్ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతో అంతర్జాతీయ స్థాయిలోనూ విక్రయాలు జరుగుతున్నాయి. ప్రారంభమైన రెండేండ్లలోనే సంస్థ రూ.60 లక్షల టర్నోవర్ సాధించింది. నారాయణపేట కాటన్, పట్టు చీరలు, డ్రెస్ మెటీరియల్, తువ్వాళ్లు, వెదురు వస్తువులు, జనపనార సంచులు, విస్తళ్లు, జామ్, హెర్బల్ టీపొడి, పల్లీ చిక్కీలు, చిరుధాన్యాల చిరుతిళ్లు, బ్లాక్ రైస్ మొదలైనవి ఇ-స్టోర్‌లో లభిస్తాయి.

నైపుణ్య శిక్షణ
ఆరుణ్య నేతృత్వంలో స్వయం సహాయక సంఘాల మహిళల పనితనానికి మెరుగులు పెడుతున్నారు. నాబార్డ్ ఆర్థిక సాయంతో ఇప్పటి వరకు 60 మందికి కలంకారీ హ్యాండ్ పెయింటింగ్‌లో శిక్షణ ఇచ్చారు. ఇప్పటికే తర్ఫీదు పొందినవారు కలంకారీ శైలిలో చీరలు, డ్రెస్ మెటీరియల్ రూపొందిస్తున్నారు. లాభాలూ ఆర్జిస్తున్నారు. మరో అరవై మందికి బ్లాక్ ప్రింటింగ్‌లో, ఫామ్ లీఫ్ క్రాఫ్ట్‌లో శిక్షణ ఇచ్చారు. వీరి ఉత్పత్తులను సైతం ఆరుణ్య పేరుపైనే అమ్ముతున్నారు. ఆరుణ్యను బలమైన బ్రాండ్‌గా తీర్చిదిద్దడంలో స్వయం సహాయక సంఘాల పాత్ర కీలకం. శిక్షణతో నైపుణ్యానికి మెరుగులు దిద్దుకుంటూ, ఉత్పత్తులకు కొత్త హంగులు అద్దుకుంటూ, ఇంటర్నెట్ సాయంతో నయా ట్రెండ్స్‌ను అర్థం చేసుకుంటూ.. సంస్థను లాభాల దిశగా తీసుకెళ్తున్నారు.
‘మొదట్లో మేం చాటలు, బుట్టలు అల్లేవాళ్లం. గతంలో పనిచేసిన డీఆర్డీవో అధికారి కాళిందిని వెదురు వస్తువులు తయారు చేయడం నేర్పించారు. ఆ తర్వాత యూట్యూబ్‌లో చూసి కొత్త డిజైన్లను రూపొందించాం. ఆరుణ్యలో సభ్యత్వం తీసుకున్నాక ఆన్లైన్ ఆర్డర్లు బాగా వస్తున్నాయి’ అని వివరిస్తారు కొల్లంపల్లి గ్రామానికి చెందిన కోస్గి లక్ష్మి. ప్లాస్టిక్‌పై నిషేధాన్ని ఓ వ్యాపార అవకాశంగా మలుచుకున్నారు అశోక్‌నగర్ వాసి బి.మాధవి. జనపనార సంచుల తయారీలో తనదైన ప్రత్యేకతను చాటుకుంటున్నారామె. ఒకరా ఇద్దరా, కలెక్టర్ నుంచి సామాన్య గృహిణుల వరకు.. సకల మహిళల సమష్టి విజయం.. ఆరుణ్య.
…? వారధి నవీన్ కుమార్

Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
Talasani srinivas Yadav | పట్టభద్రులు అందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్
Swayambhu | విజువల్ ఎఫెక్ట్స్ పనులు.. నిఖిల్ ‘స్వయంభూ’ విడుదల మరింత ఆలస్యం!
NZvIND: ఇండియా టార్గెట్ 181
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

