అతని మరణం..ఆమెకు నరకం.. బలవన్మరణాల ప్రభావం మహిళల మీదే ఎక్కువ
World Suicide Prevention Day ( నేడు అంతర్జాతీయ ఆత్మహత్యల నివారణ దినం )| ఆత్మహత్య చేసుకోవడం అంటే తమమానాన తాము చనిపోవడం కాదు. బంధాలను, బాధ్యతలను విస్మరించి కుటుంబాన్ని వీధిన పడేయడమే. ఏటికేడాది ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. బలవన్మరణాల ప్రభావం ఆ కుటుంబంలోని మహిళల మీదే ఎక్కువ. ఆమె భార్య కావచ్చు, తల్లి కావచ్చు, కూతురు కావచ్చు.
కుటుంబమంటే నమ్మకం. ఆత్మీయత. తెగిపోని బంధం. జీవితానికి భరోసా. ఆధునికత జీవన గమనాన్ని మార్చేసింది. అనివార్యమైన ఉపాధి వలసలు, నగరీకరణ ప్రభావాలు.. ఉమ్మడి కుటుంబ వ్యవస్థను విచ్ఛిన్నం చేశాయి. దీంతో అయినవారికి, ఆత్మీయులకు దూరంగా జీవితాలను వెళ్లదీస్తున్నవారు అనేకం. కష్టకాలంలో ఓదార్పు లేక, సాంత్వన అందక, ధైర్యం చెప్పేవారు కరువై మనోవేదనతో నలిగిపోతూ.. తమలో తామే కుమిలిపోతూ ఆత్మహత్యలకు తెగబడుతున్నారు. మరోవైపు మానవ సంబంధాలు కుంచించుకు పోతున్నాయి. మమతా
నురాగాలను ట్విట్టర్, ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ తదితర సామాజిక మాధ్యమాలు మింగేస్తున్నాయి. చుట్టూ ఎంతమంది ఉన్నా స్మార్ట్ ఫోన్లతోనే కాలక్షేపం చేస్తున్నారు. ఎదుటి మనిషిని నోరారా పలకరించలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో చిన్న సమస్య తలెత్తినా తల్లడిల్లిపోతున్నారు. గుండె గోసను ఎవరితో పంచుకోవాలో తెలియక చావులో పరిష్కారం
వెతుకుతున్నారు. దీంతో ఆ వ్యక్తి మీద ఆధారపడిన కుటుంబం.. ముఖ్యంగా మహిళలు, చిన్నారులు దిక్కులేనివారై పోతున్నారు.
ఆర్థికంగా, సామాజికంగా దుర్భర పరిస్థితిని అనుభవిస్తున్నారు. ఆ కుంగుబాటుతో శారీరక, మానసిక వ్యాధుల బారిన పడుతున్నారు. చివరికి తామూ ఆత్మహత్యల వైపు అడుగులు వేస్తున్నారు. తండ్రి చావుతో, తల్లి కుంగుబాటుతో.. మద్యం, మాదక ద్రవ్యాల మత్తులో చిక్కుకుంటున్న పిల్లలనూ మనం చూస్తున్నాం. ఒకరి ఆత్మహత్య మొత్తంగా ఆ కుటుంబాన్నే సంక్షోభంలోకి నెట్టేస్త్తున్న దుస్థితి నెలకొంది. జీవిత భాగస్వామిని, పిల్లలను ప్రేమించేవారెవరూ చావును ఆలింగనం చేసుకోరు. జీవితం అంటేనే ఓ యుద్ధం. నిలబడి పోరాడాలి. ‘చావు ఏ సమస్యకూ పరిష్కారం కాదు. ఆత్మహత్యకు ముందు ఒక్కసారి తమ కుటుంబం గురించి, ఆత్మీయుల గురించి ఆలోచించాలి. ఇంట్లో ఏ ఒక్కరు ఆత్మహత్య చేసుకున్నా.. ఆ ప్రభావం ముందుగా సున్నిత మనస్కురాలైన మహిళ మీదే పడుతుంది. ఆ షాక్ నుంచి కోలుకోవడానికి చిన్నారులకు మరింత సమయం పడుతుంది. ఆ ఇద్దరూ అవమానాలను, వివక్షను భరించాల్సి వస్తుంది’ అంటూ విశ్లేషిస్తారు సైకోథెరపిస్ట్ డాక్టర్ హిప్నో పద్మా కమలాకర్.

…✍ మ్యాకం రవికుమార్
Read More :
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

