ఉమ్మడి పరిష్కారం
ఇంద్ర నూయి.. పెప్సికో మాజీ సీయీవో. తనకు మహిళల సమస్యల పట్ల లోతైన అవగాహన ఉంది. భారతీయ విలువలను అపారంగా గౌరవిస్తారు. ఆధునిక స్త్రీ ఎదుర్కొంటున్న సవాళ్లకు సనాతన సంప్రదాయంలోనే పరిష్కారం ఉందని చెబుతారు.
ఇంద్ర నూయి.. పెప్సికో మాజీ సీయీవో. తనకు మహిళల సమస్యల పట్ల లోతైన అవగాహన ఉంది. భారతీయ విలువలను అపారంగా గౌరవిస్తారు. ఆధునిక స్త్రీ ఎదుర్కొంటున్న సవాళ్లకు సనాతన సంప్రదాయంలోనే పరిష్కారం ఉందని చెబుతారు.
నేను ఉమ్మడి కుటుంబంలో పుట్టాను, పెరిగాను. ఎక్కడా సమస్య ఎదురుకాలేదు. మా అమ్మ పెద్దగా చదువుకోలేదు. కారణం, పెద్దలు ఒప్పుకోలేదు. నా విషయానికి వచ్చేసరికి.. పట్టుబట్టి చదివించింది. ప్రయోజకురాల్ని చేసింది. పిల్లల పెంపకంలో నాకు అండగా నిలబడింది. అత్తామామల వైపు నుంచి కూడా అంతే మద్దతు లభించింది. నిన్న విజయవంతమైన ఫార్ములా, నేడు ఎందుకు కాదు? నా అభిప్రాయం ప్రకారం.. ఉమ్మడి కుటుంబాలదే భవిష్యత్తు.
మహిళ ఎదుగుదల అయినా, కెరీర్ మీద ఫోకస్ అయినా.. ఉమ్మడి కుటుంబంలో ఉన్నప్పుడే సాధ్యం. అక్కడ సపోర్ట్ గ్రూప్ ఉంటుంది. ప్రేమించే మనుషులు ఉంటారు. నిజమే. ఆ వ్యవస్థలోనూ కొన్ని పరిమితులు ఉండవచ్చు. కానీ వాటితో పోలిస్తే ప్రయోజనాలే ఎక్కువ. మన తాతలు అనుసరించిన ఉమ్మడి కుటుంబ వ్యవస్థనే మనమూ యథాతథంగా కొనసాగించాలని లేదు. పరిస్థితులను బట్టి చిన్నచిన్న మార్పులు చేసుకుందాం. అంతమందీ ఒకే ఇంట్లో ఉండటం అసాధ్యం కావచ్చు. కానీ, ఒకే అపార్ట్మెంట్లో ఉండొచ్చు. ఒకే కాలనీలో ఇళ్లు తీసుకోవచ్చు. ఎవరు వద్దన్నారు? ఇలా, ఉమ్మడి కుటుంబ స్వరూపానికి చిన్నచిన్న మార్పులు చేసుకోవచ్చు. అంతే కానీ, మొత్తంగా కూల్చేయకూడదు.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ENE Repeat | ‘ఈఎన్ఈ రిపీట్’ అందరూ కలిసి ఎంజాయ్ చేసేలా ఉంటుంది.. ట్రైలర్ లాంచ్లో తరుణ్ భాస్కర్!
Pocket Rockets | నిహారిక కొణిదెల ‘పాకెట్ రాకెట్స్’ టీజర్ విడుదల.. డిసెంబర్ 11న థియేటర్లలో సందడి!
Air Pollution | నగరాల్లో తీవ్రమవుతున్న వాయు కాలుష్యం.. జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న నిపుణులు..
ఎంజీయూ హాస్టల్స్ డైరెక్టర్గా డా.జి లక్ష్మీప్రభ నియామకం
‘గొర్రెల కాపరులకు పింఛన్లు ఇవ్వాలి’
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

