వాలెంటైన్స్ డే అనగానే రోజాలే గుర్తుకొస్తాయి చాలామందికి. కానీ, ఎప్పుడూ గులాబీలేనా? బోర్ కొట్టదూ? ఇతర పుష్పాలనూ ప్రయత్నించవచ్చు కదా! కొత్తదనంతోనే ప్రేమ నిత్యనూతనం అవుతుంది.
లిల్లీలు : మనం ప్రేమకు చాలా విలువ ఇస్తున్న భావన కలిగిస్తాయి. ఏ రంగు లిల్లీలైనా సరే, మనసును మెప్పిస్తాయి.
డైసీ : చామంతిని పోలినట్టు ఉండే డైసీలు ఇప్పుడు మన దగ్గరా దొరుకుతున్నాయి. పిడికెడు డైసీ పూలను బొకేలా అందిస్తే, గంపగుత్తగా ప్రేమను అందుకున్నట్టే.
తులిప్ : ప్రేమను, విశ్వాసాన్ని ప్రకటించేందుకు వాడే తులిప్ పూలు వాలెంటైన్స్ డేకి సరైన తోడు. తప్పక మనసు గెలుచుకుంటాయి.
పొద్దు తిరుగుడు : సూర్యుడి వైపే తలతిప్పే సన్ ఫ్లవర్స్, ప్రేమను కూడా తమవైపు తిప్పుకోగలవు. ఓ రెండు పూలతో అందమైన బొకే రూపొందిస్తే నిండుగా ఉంటుంది.