విజయం మనదే!

‘కరోనా సెకండ్ వేవ్‌పై జరుగుతున్న యుద్ధంలో విజయం మనదే కావాలి’ అంటున్నది ప్రముఖ హీరోయిన్ రష్మిక మందన్న. కరోనా రెండో దశ తనకు చేదు జ్ఞాపకాలను మిగిల్చిందని కించిత్ బాధతో కూడిన స్వరంతో ప్రకటించింది రష్మిక. వరుస సినిమా షూటింగ్‌ల కారణంగా తను కరోనా సెకండ్ వేవ్‌లో ఫ్యామిలీకి దూరంగా ఉండాల్సి వచ్చిందట. ‘రోజూ టీవీలు, పేపర్లలో వస్తున్న కథనాలు చూసి చలించిపోయాను. ఎప్పుడేం జరుగుతుందోననే భయం నన్ను వెంటాడింది. నా ఫ్యామిలీ గురించి చాలా భయపడ్డా. చాలామంది కులాలు, మతాలు, ప్రాంతాలు, సంస్కృతులను పక్కనపెట్టి కరోనా బాధితులను ఆదుకున్నారు. మానవత్వం ఇంకా బతికే ఉందని నిరూపించారు. వారందరికీ నా అభినందనలు. ఈ మహమ్మారి ఎప్పుడు అంతమవుతుందో తెలియదు కాబట్టి.. ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా ఉండాలి’ అంటూ అభిమానులకు పిలుపునిచ్చింది రష్మిక మందన్న. ప్రస్తుతం బాలీవుడ్లో ‘మిషన్ మంజు’, ‘గుడ్‌బై’ వంటి సినిమాల్లో కథానాయికగా నటిస్తున్నదిరష్మిక.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

