పిచ్చి మునులు. అమాయకపు రుషులు. అప్సరస కనిపించగానే.. తపస్సును తూచ్ అనిపించి, గడ్డాన్ని ట్రిమ్ చేసుకుని.. డ్యూయెట్కు సిద్ధపడేవారు. అలనాటి, అప్సరల పుణ్యమాని పురాణాల్లో ఇంద్రుడి సీటు నిలబడింది.
నేటి అప్సరల ప్రభావంతో సినిమా థియేటర్లో సీట్లు నిండుతున్నాయి. ఉంగరాల జుట్టుతో.. వాడిచూపుల కనికట్టుతో.. వర్ధమాన తార అప్సర రాణి ‘రాచరికం’ చిత్రాన్ని ఏ మేరకు ప్రభావితం చేస్తుందో చూడాలి?