వెజ్ రోల్స్..తయారీ విధానం.. కావలసిన పదార్థాలు
మైదా: అరకప్పు, కార్న్‌ఫ్లోర్: రెండు టేబుల్ స్పూన్లు, టమాట, క్యారెట్, ఆలుగడ్డ, క్యాప్సికమ్ ముక్కలు: రెండు టేబుల్ స్పూన్ల చొప్పున, పచ్చిమిర్చి: నాలుగు, ఉల్లిగడ్డ: ఒకటి, నూనె: పావు కప్పు, ఉప్పు: తగినంత, కారం: ఒక టీస్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్: అర టీస్పూన్, గరం మసాలా: పావు టీస్పూన్, కొత్తిమీర తురుము: కొద్దిగా.
కావలసిన పదార్థాలు
మైదా: అరకప్పు, కార్న్‌ఫ్లోర్: రెండు టేబుల్ స్పూన్లు, టమాట, క్యారెట్, ఆలుగడ్డ, క్యాప్సికమ్ ముక్కలు: రెండు టేబుల్ స్పూన్ల చొప్పున, పచ్చిమిర్చి: నాలుగు, ఉల్లిగడ్డ: ఒకటి, నూనె: పావు కప్పు, ఉప్పు: తగినంత, కారం: ఒక టీస్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్: అర టీస్పూన్, గరం మసాలా: పావు టీస్పూన్, కొత్తిమీర తురుము: కొద్దిగా.
తయారీ విధానం
పాన్‌లోని నూనె వేడయ్యాక సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ వేయాలి. అవన్నీ వేగాక క్యారెట్, ఆలు, క్యాప్సికమ్, టమాట ముక్కలు వేసి బాగా వేయించాలి. కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, గరం మసాలా, కొత్తిమీర తురుము జోడించి మరో మూడు నిమిషాలు వేయించి దించి చల్లార్చుకోవాలి. ఒక గిన్నెలో మైదా, కార్న్‌ఫ్లోర్, ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి బాగా కలిపి, తగినన్ని నీళ్లు పోసుకుని ముద్దలా చేసుకుని పావుగంటపాటు నాన బెట్టాలి.
పిండిని కొద్దికొద్దిగా తీసుకుని పలుచని చపాతీల్లా చేసుకోవాలి. స్టవ్ మీద పెనం పెట్టి చపాతీలను పది సెకన్లపాటు రెండువైపులా కాల్చి తీసేయాలి. ఇప్పుడు ఒక్కో చపాతీ మధ్యలో కూరగాయల మిశ్రమం పెట్టి అన్నివైపులా మూసి రోల్స్‌లా చుట్టుకుని చివర్లను మైదా నీళ్లతో అంటించాలి. స్టవ్‌మీద కడాయి పెట్టి వేయించడానికి సరిపడా నూనెపోసి వేడయ్యాక చుట్టి ఉంచిన రోల్స్ వేసి దోరగా కాల్చుకుంటే కరకరలాడే వెజ్ రోల్స్ రెడీ.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi: నా ఫోన్ ట్యాప్ చేశారు.. మోదీ చర్చకు రావాలి: రాహుల్ గాంధీ
Jangaa | త్రిగుణ్ ‘జంగా’ గ్లింప్స్ విడుదల.. రా అండ్ రస్టిక్ లుక్‌లో అదరగొట్టిన హీరో!
Gadari Kishore | బీర్ల ఐలయ్య బ్రోకర్ లెక్క మాట్లాడుతున్నడు : మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్
minister’s home attcked | మంత్రి ఇంటిపై దాడి.. ‘మేము చనిపోయాక వస్తారా?’ అంటూ పోలీసులపై ఆగ్రహం
Show cause notices | విధులకు గైర్హాజరైన హెచ్ఎం, ఆరుగురు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

