లావాదేవీకి ఏది మంచిది?
ఆర్థిక లావాదేవీలన్నీ ఆన్లైన్లోనే చేస్తున్నారు. కూరగాయల దగ్గర్నుంచి కంప్యూటర్ దాకా.. ఏది కొన్నా ఆన్లైన్ ద్వారానే డబ్బులు కడుతున్నారు. ఈ క్రమంలో యూపీఐ, క్రెడిట్ కార్డ్‌ను ఎక్కువగా వాడుతున్నారు.
ఆర్థిక లావాదేవీలన్నీ ఆన్లైన్లోనే చేస్తున్నారు. కూరగాయల దగ్గర్నుంచి కంప్యూటర్ దాకా.. ఏది కొన్నా ఆన్లైన్ ద్వారానే డబ్బులు కడుతున్నారు. ఈ క్రమంలో యూపీఐ, క్రెడిట్ కార్డ్‌ను ఎక్కువగా వాడుతున్నారు. అయితే, ఈ రెండిటిలో ఏది బెటర్? ఏయే సందర్భాల్లో దేన్ని వాడాలి? ఇలాంటి అనుమానాలకు ఆర్థిక నిపుణులు సరైన సలహాలు అందిస్తున్నారు.
యూపీఐ పేమెంట్
చిన్నచిన్న ఖర్చులు, బడ్జెట్ నియంత్రణకు ఫోన్ ద్వారా చేసే ‘యూపీఐ’ పేమెంట్ ఉత్తమం. ఇక్కడ వాడేది మీ సొంత డబ్బు. నేరుగా మీ బ్యాంక్ ఖాతా నుంచే డబ్బులు డెబిట్ అవుతాయి. రోడ్డుమీద కూరగాయల బండి నుంచి మొదలు.. పెద్దపెద్ద మాల్స్ వరకు ప్రతిచోటా యూపీఐ క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఇక దీనిద్వారా మీ బ్యాంక్ అకౌంట్లోని డబ్బు మాత్రమే ఖర్చవుతుంది. కాబట్టి, బడ్జెట్ దాటిపోయే అవకాశం తక్కువగా ఉంటుంది. ఇందుకోసం ఎలాంటి కార్డులను తీసుకెళ్లాల్సిన పని లేదు. పిన్ నంబర్, బయోమెట్రిక్‌తో సెకన్లలోనే పేమెంట్ అయిపోతుంది. అయితే, కొన్నిసార్లు బ్యాంక్ సర్వర్ డౌన్ అయితే.. పేమెంట్ స్ట్రక్ అయిపోయే ప్రమాదం ఉంటుంది. మీ అకౌంట్లో డబ్బులు కట్ అయినా.. ఎదుటివారి ఖాతాలో జమ అవ్వవు. అలాంటప్పుడు కాస్త ఇబ్బంది పడాల్సి ఉంటుంది. క్రెడిట్ కార్డు లావాదేవీలతో పోలిస్తే.. రివార్డులు తక్కువగా వస్తాయి.
క్రెడిట్ కార్డ్ ఎప్పుడంటే..
పెద్ద ఖర్చులు, రివార్డుల కోసం ‘క్రెడిట్ కార్డ్’ వాడటం మంచిది. క్రెడిట్ కార్డ్ అనేది బ్యాంక్ మీకు ఇచ్చే తాత్కాలిక అప్పు. దీనికి నెల చివరలో బిల్లు కట్టాల్సి ఉంటుంది. ప్రతి ఖర్చుపైనా పాయింట్లు, క్యాష్‌బ్యాక్ లాంటి రివార్డులు వస్తాయి. సూపర్ మార్కెట్లు, ఆన్లైన్ షాపింగ్, ఫ్యూయల్ వంటి వాటిపై మంచి మంచి డిస్కౌంట్లు ఉంటాయి. నెలంతా ఎన్ని ఖర్చులు చేసినా.. క్రెడిట్ కార్డ్ బిల్ కట్టేటప్పుడు మాత్రమే బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బు కట్ అవుతుంది. బిల్లులు సకాలంలో చెల్లిస్తే క్రెడిట్ స్కోర్ పెరుగుతుంది. దీనివల్ల భవిష్యత్తులో హోమ్ లోన్, కార్ లోన్ సులభంగా వస్తాయి. ఏదైనా ఫ్రాడ్ జరిగితే క్రెడిట్ కార్డ్‌లో డబ్బును హోల్డ్ చేయవచ్చు. అదే, యూపీఐలో పోతే రికవరీ కష్టం. ఇక ఇందులోని మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే.. చేతిలో డబ్బు లేకపోయినా కొనచ్చు కాబట్టి, అవసరానికి మించి ఖర్చు చేసే అవకాశం ఉంది. నెల తిరిగేసరికి బిల్లు పూర్తిగా కట్టకపోతే.. భారీస్థాయిలో వడ్డీలు, లేట్ ఫీజులు చెల్లించాల్సి వస్తుంది.అందుకే, క్రెడిట్ కార్డ్ బిల్లును సకాలంలో పూర్తిగా కట్టగలరని అనుకుంటేనే.. వాటి జోలికి వెళ్లాలని ఆర్థిక నిపుణులు సలహా ఇస్తున్నారు. లేదంటే.. నిశ్చింతగా యూపీఐ వాడటమే అన్ని విధాలా సురక్షితం.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

