Ugadi Pachadi | ఉగాది పచ్చడి.. జీవితంలో ఎదురయ్యే కష్టసుఖాలకు ప్రతీక షడ్రుచులు
ఉగాది పచ్చడిని అయినవారు, ఆత్మీయులతో పంచుకోవడమే కాదు..ఇల్లాలూ తీసుకోవాలి. ఎందుకంటే, అందులోని పోషకాల అవసరం ఆమెకే ఎక్కువ. ఉగాది పచ్చడిలోని ఆరు రుచులను మధురామ్లలవణకటుతిక్త కషాయరసాలుగా వివరిస్తుంది ఆయుర్వేదం.
ఉగాది పచ్చడిని అయినవారు, ఆత్మీయులతో పంచుకోవడమే కాదు..ఇల్లాలూ తీసుకోవాలి. ఎందుకంటే, అందులోని పోషకాల అవసరం ఆమెకే ఎక్కువ. ఉగాది పచ్చడిలోని ఆరు రుచులను మధురామ్లలవణకటుతిక్త కషాయరసాలుగా వివరిస్తుంది ఆయుర్వేదం. జీవితంలో ఎదురయ్యే కష్టసుఖాలకు షడ్రుచులు ప్రతీక. అంతేకాదు, మారే రుతువులకు అనుగుణంగా వాతావరణంలో కలిగే మార్పుల కారణంగా శరీరంలో దోషాలు వృద్ధి చెందుతాయి. అవి సాధారణ స్థితికి రావడానికి కూడా ఆహారంలో మార్పులు అవసరం. ఉగాది పచ్చడితో ఆ ప్రయత్నం మొదలవుతుంది.
తీపి.. బెల్లం

Bellam
మధురరసం జీవితంలోని సంతోషాన్ని సూచిస్తుంది. తీపిని అందరూ ఇష్టపడతారు. ఆ రుచి మనసుకు ఆహ్లాదాన్ని ఇస్తుంది. గొంతుకూ మంచిదే. మూత్ర సమస్యలు ఉన్నవారి ఇబ్బందులను తొలగిస్తుంది. మల బద్ధకాన్ని నివారిస్తుంది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది, పెంపొందిస్తుంది కూడా. రోగ నిరోధక శక్తిని ఇస్తుంది. స్త్రీలలో స్థన్య వృద్ధికి తోడ్పడుతుంది. గర్భస్రావాన్ని ఆపుతుంది. పురుషుల్లో శుక్ర కణాల వృద్ధినిస్తుంది. శిరోజాల ఆరోగ్యానికి సాయపడుతుంది. చర్మానికి వన్నె తెస్తుంది. ధాతుపుష్టికి తోడ్పడుతుంది. అతిగా సేవిస్తే ఆకలి మందగించడం, ఓబీసీటీ తదితర సమస్యలు తలెత్తుతాయి.
పులుపు.. చింతపండు

Tamarinds
ఈ రుచి అయిష్టత అనే ఉద్వేగాన్ని సూచిస్తుంది. ఆరోగ్యపరంగా చూస్తే ఇంద్రియాలను ఉత్తేజపరుస్తుంది. లాలాజల ఊట పెంచుతుంది. జీర్ణవ్యవస్థను ఉత్తేజపరుస్తుంది. జీర్ణశక్తిని ఇస్తుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. రోగ నిరోధక శక్తినిస్తుంది. విరేచన కారి. జీర్ణాశయంలోని మలినాలను బయటికి విసర్జిస్తుంది. అతిగా సేవిస్తే మాత్రం రక్తపిత్త వికారాలు కలుగుతాయి. పురుషుల్లో శుక్రకణాలు తగ్గుతాయి.
తిక్తరసం.. చేదు.. వేపపువ్వు

Neem Flower
జీవితంలోని విషాదాన్ని సూచిస్తుంది. వైద్యపరంగా.. గాయాలను త్వరగా నయం చేస్తుంది. చర్మ సమస్యలను తగ్గిస్తుంది. శరీరం లోపలి భాగాన్ని శుద్ధి చేస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. హానికర క్రిములను హరిస్తుంది. దాహాన్ని తగ్గిస్తుంది. అతిసారాన్ని అరికడుతుంది. రక్త వృద్ధికి తోడ్పడుతుంది. శ్లేష్మాన్ని నియంత్రిస్తుంది. అతిగా తీసుకుంటే గుండెకు ఏమాత్రం మంచిది కాదు.
కషాయరసం.. వగరు .. మామిడి

Mango
ఆశ్చర్యం అనే భావోద్వేగాన్ని సూచిస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రిస్తుంది. చర్మాన్ని శుభ్రపరచడంలో సాయపడుతుంది. బరువు తగ్గడానికి దోహదపడుతుంది. విరేచనాలను అరికడుతుంది. విరిగిన శరీర భాగాలు అతుక్కోవడంలో సహకరిస్తుంది. అతిమూత్రవ్యాధిని నిర్మూలిస్తుంది. గాయాలను మాన్పుతుంది. మితిమీరితే గుండెకు మంచిది కాదు.
స్వస్తి..
శతాయుర్వజ్ర దేహాయ
సర్వ సంపత్కరాయచ..
సర్వారిష్ట వినాశాయ
నింబకందళ భక్షణం
లవణం.. ఉప్పు

Salt
ఉప్పగా ఉండే రుచి భయాన్ని సూచిస్తుంది. ఆరోగ్య కోణంలో పరిశీలిస్తే.. థైరాయిడ్ పని తీరులో కీలక పాత్ర పోషిస్తుంది. శరీరంలో నీటి శాతాన్ని నిలిపి ఉంచుతుంది. తక్కువ రక్తపోటు సమస్యను మెరుగుపరుస్తుంది. శరీరంలో ఎలక్ట్రోలైట్స్ బ్యాలెన్స్‌కు ఉపకరిస్తుంది. ఒంట్లో పేరుకున్న మలి నాలను వదలగొడుతుంది. కఫాన్ని కరిగిస్తుంది. అతిగా తీసుకుంటే అన్నివిధాలా ప్రమాదకరమే.
కటురసం.. కారం

Redchilli
కారం వేడి స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఈ రుచి మనిషిలో కోపాన్ని, ఉద్రేకాన్ని సూచిస్తుంది. క్యాప్సిన్ అనే పదార్థం వల్ల మిరప కాయ మంటను కలిగిస్తుంది. కటురసం పురుషుల్లో ఇంద్రియ ఉత్తేజాన్నిస్తుంది.జీర్ణాశయంలో మిగిలిపోయిన ఆహార పదార్థాలను పూర్తిగా జీర్ణం చేస్తుంది. ముక్కు దిబ్బడను తగ్గించడానికి సాయపడుతుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.
ప్రొఫెసర్ డా. యశోద పెనుబాల
ఎం.డి. ఆయుర్వేద
ప్రసూతి-స్త్రీ వైద్య నిపుణులు
డా.బూర్గుల రామ కృష్ణారావు
ఆయుర్వేద వైద్య కళాశాల, హైదరాబాద్.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
- Tags
- Jaggery
- Mango
- neem flower
- tamarinds
RELATED ARTICLES
తాజా వార్తలు
Civil Supplies | సివిల్ సైప్లెలో అవినీతి రాజ్యం.. మిల్లర్లతో మిలాఖత్, గన్నీ బ్యాగుల టెండర్లలో కమీషన్ల దందా!
Ramagundam Thermal Plant | రామగుండం ప్లాంట్‌పై పూటకో మాట.. రెండున్నరేళ్లుగా తేలని నిర్ణయం!
Cyberabad Police | పోలీసు గస్తీకి సుస్తీ.. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో దందాలు, సెటిల్ మెంట్లతో ఖాకీలు బిజీ!
Horoscope | 21-10-2026 బుధవారం.. మీ రాశి ఫలాలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

