దృఢమైన కేశాల కోసం
నల్లగా నిగనిగలాడే దృఢమైన జుట్టు కావాలని అందరూ కోరుకుంటారు. ఆ ప్రయత్నంలో రకరకాల షాంపూలు, నూనెలు, హెయిర్ ప్యాక్‌లు ప్రయత్నిస్తారు. కొంతమంది మాత్రం సంప్రదాయాన్ని అనుసరించి కొబ్బరినూనెను ఎంచుకుంటారు. దీనివల్ల జుట్టు ఒత్తుగా, దృఢంగా మారుతుందని అనాదిగా వస్తున్న నమ్మకం. అయితే, కొబ్బరినూనె రాయడంలోనూ జాగ్రత్తలు తప్పనిసరి.
నల్లగా నిగనిగలాడే దృఢమైన జుట్టు కావాలని అందరూ కోరుకుంటారు. ఆ ప్రయత్నంలో రకరకాల షాంపూలు, నూనెలు, హెయిర్ ప్యాక్‌లు ప్రయత్నిస్తారు. కొంతమంది మాత్రం సంప్రదాయాన్ని అనుసరించి కొబ్బరినూనెను ఎంచుకుంటారు. దీనివల్ల జుట్టు ఒత్తుగా, దృఢంగా మారుతుందని అనాదిగా వస్తున్న నమ్మకం. అయితే, కొబ్బరినూనె రాయడంలోనూ జాగ్రత్తలు తప్పనిసరి.
- జుట్టుకు నూనె రాస్తూ చాలాసేపు మర్దన చేయకూడదు. దీనివల్ల మాడుకు నూనె బాగా పట్టి చుండ్రు పెరిగే అవకాశం ఉంది. జుట్టులోకి పదేపదే వేళ్లు చొప్పించడం వల్ల కుదుళ్లు బలహీనపడతాయి. కొద్ది నిమిషాలపాటు సుతారంగా మర్దన చేసి వదిలేయాలి.
- నూనె రాయగానే జుట్టును గట్టిగా ముడివేయకూడదు. గట్టిగా లాగి రబ్బర్లు, క్లిప్పులు వంటివి పెట్టడం వల్ల కుదుళ్లు బలహీనపడతాయి. కేశాలను వదులుగా ఉంచడమే మంచిది. అంతేకాదు అతిగా నూనె రాయడమూ మంచిది కాదు. ఎక్కువగా నూనె రాయడం వల్ల మాడుపై దుమ్ము, ధూళి చేరుతుంది.
- జుట్టుకు నూనె పట్టించి పన్నెండు గంటలకు మించి ఉంచకూడదు. తలస్నానానికి రెండు మూడు గంటల ముందు నూనె రాసి షాంపూతో కడిగేయాలి. రాత్రుళ్లు నూనె రాసుకుని పడుకోవడం వల్ల దిండు, దుప్పట్లోని దుమ్ము మాడుపై చేరిపోయి చుండ్రు, పేలు వంటి సమస్యలు వస్తాయి.
- చల్లటి నూనె కాకుండా కాస్త గోరువెచ్చని నూనెను రాయాలి. దీనివల్ల కుదుళ్లలో రక్తప్రసరణ మెరుగవుతుంది. జుట్టు దృఢంగా మారుతుంది.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

