చేతులు పగిలితే..
ముఖంపై పెట్టినంత శ్రద్ధ చేతులపై పెట్టరు చాలామంది. ఎండ, వాన, చలి అన్నిటినీ భరిస్తాయి చేతులు. దీంతో చేతులు పొడిబారుతాయి. గరకుగా మారిపోతాయి. సమస్య తీవ్రమై పగుళ్లు కూడావస్తాయి. ఈ సమస్యకు చెక్ పెట్టే మార్గాలు అనేకం..
ముఖంపై పెట్టినంత శ్రద్ధ చేతులపై పెట్టరు చాలామంది. ఎండ, వాన, చలి అన్నిటినీ భరిస్తాయి చేతులు. దీంతో చేతులు పొడిబారుతాయి. గరకుగా మారిపోతాయి. సమస్య తీవ్రమై పగుళ్లు కూడావస్తాయి. ఈ సమస్యకు చెక్ పెట్టే మార్గాలు అనేకం..
గులాబీ, నిమ్మకాయ క్రీమ్
తాజా గులాబీ రేకులు, నిమ్మ తొక్కలు ఒక గాజు కూజాలో నిల్వ చేసుకోవాలి. వాటికి ఓ కప్పు ఆలివ్‌నూనె జత చేయాలి. వారం రోజులపాటు ఆ మిశ్రమాన్ని చల్లని ప్రదేశంలో ఉంచాలి. ఆ తర్వాత నూనెను వడపోయాలి. రాత్రి పడుకునే ముందు పగిలిన చేతులపై మసాజ్ చేసుకుంటే.. చర్మం మృదువుగా తయారవుతుంది.
బేకింగ్ సోడా, కొబ్బరినూనె
మృత కణాలు చర్మాన్ని నిర్జీవంగా, నల్లగా మార్చేస్తాయి. ఆ కణాలను తొలగించడానికి బేకింగ్ సోడాలోని ప్రత్యేక గుణాలు సహాయపడతాయి. కొబ్బరినూనె చర్మానికి లోతైన పోషణ, తేమను అందించడంలో సాయపడుతుంది. ఒక గిన్నెలో ఒక కప్పు బేకింగ్ సోడా, అరకప్పు కొబ్బరినూనె కలిపి వేడి చేయాలి. ఆ తర్వాత 30 సెకన్లపాటు చేతిపై రుద్దుకోవాలి. పది నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేసుకుంటే.. త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుంది.
కాఫీ, గ్రేప్సీడ్ ఆయిల్
కాఫీ.. చర్మం మీది మృత కణాలను తొలగించడంతో పాటు, చర్మాన్ని కాంతిమంతంగా మారుస్తుంది. గ్రేప్సీడ్ ఆయిల్ చర్మాన్ని మృదువుగా చేస్తుంది. ఒక గిన్నెలో 3 టేబుల్ స్పూన్ల కాఫీ పొడి, 1 టేబుల్ స్పూన్ ద్రాక్ష నూనె కలపాలి. దాన్ని పగిలిన చేతులకు మూడు నిమిషాలపాటు సున్నితంగా మసాజ్ చేయాలి. 20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి.
సముద్రపు ఉప్పు, జొజొబా
పొడిబారిన, పగిలిన చర్మంపై ఉపయోగించడానికి సముద్రపు ఉప్పు ఉత్తమమైంది. ఇది చర్మ సమస్యలను నయం చేస్తుంది. ఓ కప్పు ఉప్పు, ఓ కప్పు జొజొబా నూనె కలిపి చేతిపై సున్నితంగా మర్దన చేయాలి. 30 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే మృదుత్వం సొంతమవుతుంది.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

