పిల్లల హక్కుల కోసం
‘వియ్ ద చిల్డ్రన్ ఆఫ్ ఇండియా’.. పిల్లల హక్కులకు పెద్ద దిక్కుగా ఫిల్మ్‌మేకర్, రచయిత్రి, ఉపాధ్యాయురాలు సమీనా మిశ్రా ప్రారంభించిన ఉద్యమం. సమాజం పిల్లల్ని పరిగణనలోకి తీసుకోవడం మానేసింది. వాళ్లకు ఓటు హక్కు లేదు కాబట్టి, పాలకులకు పట్టదు.
‘వియ్ ద చిల్డ్రన్ ఆఫ్ ఇండియా’.. పిల్లల హక్కులకు పెద్ద దిక్కుగా ఫిల్మ్‌మేకర్, రచయిత్రి, ఉపాధ్యాయురాలు సమీనా మిశ్రా ప్రారంభించిన ఉద్యమం. సమాజం పిల్లల్ని పరిగణనలోకి తీసుకోవడం మానేసింది. వాళ్లకు ఓటు హక్కు లేదు కాబట్టి, పాలకులకు పట్టదు. కొనుగోలు శక్తి లేదు కాబట్టి, కార్పొరేట్ ప్రపంచం ప్రేమ కురిపించదు. జీవితానుభవం లేకపోవడంతో ఇంట్లోనూ విస్మరణకు గురవుతున్నారు. ముఖ్యంగా హింసాత్మక సంఘటనలు జరిగినప్పుడు.. ఆ ప్రభావం పిల్లల మీదే ఎక్కువ పడుతున్నది. కానీ, ఆ పసి మనసులను ఎవరూ పట్టించుకోరు. అందుకే పిల్లల కోసం హక్కుల సదస్సులు నిర్వహిస్తారామె. అందులోనూ నేటి పరిస్థితుల్లో..
మత విద్వేషాలను ఏదో ఓ రూపంలో పిల్లల మనసుల్లో జొప్పించే ప్రయత్నం జరుగుతున్నది. పాఠశాలకు ఎలాంటి దుస్తుల్లో వెళ్లాలో మతపెద్దలే శాసించే పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ బాల్యాన్ని ఆందోళనకు గురిచేస్తున్న అంశాలు. తాను నిర్వహించే వర్క్‌షాప్‌లలో చిత్రలేఖన పోటీలు నిర్వహించడం ద్వారా ఆ లేత మనసులలో గూడుకట్టుకున్న భావాలను గుర్తించి, భయాలను తొలగిస్తారామె. ఓ సదస్సులో ఆమె ‘భారత పౌరులు అంటే ఎవరు?’ అని అడిగినప్పుడు.. చిన్నారులు ఫలానా మతానికి చెందినవారో, ఫలానా సరిహద్దుల లోపల ఉన్నవారో.. అని జవాబు ఇవ్వలేదు. ‘భారతదేశాన్ని ప్రేమించేవారంతా భారతీయ పౌరులే’ అని ముక్తకంఠంతో జవాబిచ్చారు. ‘నేను ఆశిస్తున్నదీ ఇలాంటి దేశాన్నే’ అంటారామె.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

