కాలాన్ని జయించేద్దాం
ప్రపంచంలో ఎవరికైనా రోజుకి 24 గంటలే ఉంటాయి. కానీ, ఆ 24 గంటలని ఎవరు ఎలా ఉపయోగించుకుంటారు అనేదాని మీదే వారి జీవితాలు ఆధారపడి ఉంటాయి. అందుకే 20వ శతాబ్దంలో టైమ్ మేనేజ్మెంట్కి చాలా ప్రాధాన్యం ఇస్తున్నారు.
ప్రపంచంలో ఎవరికైనా రోజుకి 24 గంటలే ఉంటాయి. కానీ, ఆ 24 గంటలని ఎవరు ఎలా ఉపయోగించుకుంటారు అనేదాని మీదే వారి జీవితాలు ఆధారపడి ఉంటాయి. అందుకే 20వ శతాబ్దంలో టైమ్ మేనేజ్మెంట్కి చాలా ప్రాధాన్యం ఇస్తున్నారు. వాటికోసం రకరకాల వ్యూహాలూ ప్రచారంలో ఉన్నాయి. అలాంటి ఒక పద్ధతే పొసెక్ పద్ధతి (POSEC Method).
1943లో మాస్లో అనే ఆయన హైరార్కీ ఆఫ్ నీడ్స్ అనే సిద్ధాంతాన్ని రూపొందించారు. ఒక మనిషి సంతోషంగా ఉండేందుకు ఎలాంటి అవసరాలు తీరాలో ఇందులో పేర్కొన్నారు. దీని ఆధారంగానే పొసెక్ మెథడ్‌ని రూపొందించారు. మన అవసరాలు, లక్ష్యాలకు అనుగుణంగా సమయాన్ని ఎలా ఉపయోగించుకోవాలో ఈ పద్ధతిలో సూచించే ప్రయత్నం చేశారు. అవేమిటంటే…
ప్రియారిటైజ్ (Prioritize): మీ జీవితంలో అతిముఖ్యమైన లక్ష్యాలు ఏమిటి. వాటిని సాధించేందుకు ఏం చేయాలి. వాటి కోసం ఎంత సమయం కేటాయించాలి అన్న విషయాలన్నీ ఈ ప్రియారిటైజ్ కోవలోకి వస్తాయి.
ఆర్గనైజ్ (Organize): జీవితం స్థిరంగా ఉండేందుకు ఎలాంటి పరిస్థితులు అవసరం అన్న అంశాలు ఈ విభాగంలోకి వస్తాయి. ఉదాహరణకు కుటుంబం, ఉద్యోగం, ఆరోగ్యం… లాంటి అంశాలన్నమాట.
స్ట్రీమ్‌లైన్ (Streamline): చేసే ప్రతి పనీ మనకి ఇష్టం లేకపోవచ్చు. కానీ, జీవితం సాఫీగా సాగిపోవాలంటే వాటిని నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు. సమయానికి బండిని సర్వీస్ చేయించుకోవడం దగ్గర్నుంచీ, బీమా ప్రీమియం చెల్లించడం వరకు మన చుట్టూ ఉంటే పరిస్థితులను సక్రమంగా ఉంచుకోవడం వల్ల సమయం, శ్రమా రెండూ ఆదా అవుతాయి.
ఎకానమైజ్ (Economize): కొన్ని పనుల వల్ల ఉపయోగం ఉండదు. అవి అత్యవసరమూ కాదు. కానీ, ఇవి లేకపోతే జీవితం మరీ బోర్ కొట్టేయవచ్చు. స్నేహితులతో పార్టీ చేసుకోవడం, బంధువుల ఇంటికి వెళ్లడం, సినిమా చూడటం… లాంటివన్నీ ఈ కోవలోకే వస్తాయి.
కాంట్రిబ్యూట్ (Contribute): పక్కవారికి ఏదో సాయం కావాలి! తోటి మనిషిగా ఆ బాధ్యతలో పాలుపంచుకోవడం మన కర్తవ్యం. వీధిలో జనం అంతా కలిసి రోడ్డుని శుభ్రం చేసుకుంటున్నారు!
పౌరుడిగా పాల్గొనడం మన ధర్మం. ఎన్నికలు జరుగుతున్నాయి. పౌరుడిగా ఓటు వేసేందుకు లైనులో నిలబడటం మన బాధ్యత. ఇవన్నీ చేయాలని ఎవరూ అనరు. ఇలాంటి పనులు చేయడం వల్ల మనకి సమయం, శ్రమ వృథాగానే తోచవచ్చు. కానీ, వీటి ఫలితం భవిష్యత్తులో కనిపించి తీరుతుంది. సమాజాన్ని ముందుకు నడిపించడంలో, మనం అశ్రద్ధ చేయలేదన్న తృప్తిని అందిస్తుంది. ఇలాంటి పనులన్నీ కాంట్రిబ్యూట్ విభాగంలోకి వస్తాయి.ఇవండీ ‘పొసెక్ మెథడ్’ లక్షణాలు. మన జీవితంలో పనులన్నిటినీ ఈ దృక్పథంతో చూస్తే… వేటికి ఎంత ప్రాధాన్యం ఇవ్వాలి, ఎంత సమయం కేటాయించాలి అన్న స్పష్టత ఏర్పడుతుంది.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

