విద్యార్థుల అక్షర ‘జ్యోతి’

ఆ పంతులమ్మకు స్కూల్ తర్వాతే ఏదైనా! విద్యార్థుల తర్వాతే ఇంకెవరైనా. పాఠశాలలో చేరింది మొదలు బడి రూపురేఖలే మార్చేశారు. కార్పొరేట్ స్కూల్‌కు దీటుగా తీర్చిదిద్దారు.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం ఇందిరానగర్ కాలనీ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలు మేకల జ్యోతిరాణి. ఈ పాఠశాలలో మొదట్లో పట్టుమని పదిమంది విద్యార్థులు కూడా లేరు. జ్యోతిరాణి చొరవతో ఆ సంఖ్య 120కి చేరుకుంది. ఈ ఏడేండ్లలో 200 మంది విద్యార్థులు పెద్ద తరగతులకు వెళ్లారు.
పాఠశాలలో మౌలిక వసతులు కల్పించడంలో జ్యోతిరాణి విద్యా ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రజా ప్రతినిధులు, ఎన్ఆర్ఐల సహకారంతో బల్లలు, ఆటవస్తువులు, వాటర్ ఫిల్టర్లు, టీవీ, ఆటవస్తువులు, మధ్యాహ్న భోజనం కోసం గ్యాస్ స్టవ్, ఇతర సామగ్రి సమకూర్చారు. కొత్త తరగతుల నిర్మాణం చేపట్టారు. బడి ప్రాంగణంలో మహాత్మాగాంధీ విగ్రహం ప్రతిష్ఠించారు. సొంత డబ్బు వెచ్చించి సరస్వతీదేవి, తెలంగాణ తల్లి విగ్రహాలు ఏర్పాటు చేయించారు. విద్యార్థులను చదువులకే పరిమితం చేయకుండా.. అన్నిటా దూసుకుపోయేలా తీర్చిదిద్దుతున్నారు జ్యోతిరాణి. ప్రాథమిక పాఠశాలలో స్కౌట్స్ అండ్ గైడ్స్ ఏర్పాటు చేయించారు. ఇందుకోసం తానే శిక్షణ తీసుకొనివచ్చి, విద్యార్థులకు తర్ఫీదునిస్తున్నారు. గోరఖ్‌పూర్‌లో జరిగిన బుల్బుల్ ఉత్సవంలో విద్యార్థులతో కలిసి పాల్గొన్నారు. కరోనా సమయంలో బడులు మూతపడటంతో పిల్లలు నష్టపోకుండా యూట్యూబ్ ద్వారా పాఠాలను బోధించారు. అదే సమయంలో స్వచ్ఛంద సంస్థల చేయూతతో అన్నదాన కార్యక్రమం చేపట్టారు. హరితహారంలో భాగంగా పాఠశాల ప్రాంగణంతోపాటు ఊరంతా మొక్కలు నాటించారు. వాటి సంరక్షణా తనే చూసుకొన్నారు. ఇప్పుడవి చెట్లుగా ఎదిగి నలుగురికీ నీడనిస్తున్నాయి. పాఠశాల ‘స్వచ్ఛ బడి’గా గుర్తింపు సాధించడం విశేషం. తన అంకిత భావానికి గుర్తింపుగా ఉత్తమ ఉపాధ్యాయురాలిగా అవార్డు అందుకున్నారు జ్యోతిరాణి, ‘హరిత మిత్ర’ పురస్కారమూ వరించింది. ‘అవార్డులూ గుర్తింపుల కన్నా పలు పోటీల్లో నా విద్యార్థులు రాణించడమే ఎక్కువ ఆనందాన్ని ఇచ్చింది’ అంటారు జ్యోతిరాణి.
… కాగితపు వెంకటేశ్వరరావు
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
- Tags
- infrastructure
- jyothi
- Teacher
RELATED ARTICLES
తాజా వార్తలు
Feel Good | ‘ఫీల్ గుడ్’ చిత్రం నుంచి ‘మమ్మా మియా’ పాట విడుదల!
Probiotics | పండుగల వేళ జీర్ణ సమస్యలా? ఇంట్లోనే తయారు చేసుకోండి ఈ 4 ప్రోబయోటిక్ ఆహారాలు!
President Droupadi Murmu | ఒడిశాకు తుఫాన్ సూచన.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన వాయిదా
PV Sindhu | జపాన్ క్రీడాకారిణి హినా అకేచిపై విజయం.. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరిన పీవీ సింధు
Bhargav Desh Pande | కాంగ్రెస్ పార్టీ అసలైన కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న కిరాయి నాయకులు : మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

