అర్ధనారీశ్వరం
సినిమాల్లో, ఓటీటీ వెబ్‌సిరీస్‌లలో ఇప్పుడు బయోపిక్ ట్రెండ్ నడుస్తున్నది. వాస్తవికతకు సినిమాటిక్ డ్రామా జోడించి బయోపిక్‌లతో మంచి విజయాలను అందుకుంటున్నారు దర్శక, నిర్మాతలు. ట్రాన్స్జెండర్ల హక్కుల కోసం పోరాటం చేసిన శ్రీగౌరి సావంత్ జీవిత కథ ఆధారంగా ‘తాలీ’ నిర్మించారు. ఆరు ఎపిసోడ్లుగా తీసిన ఈ సిరీస్‌లో సుస్మితా సేన్ ప్రధాన పాత్ర పోషించింది.
తాలీ జియో సినిమా: ఆగస్టు 15
తారాగణం: సుస్మితా సేన్, కృతిక దేవ్, ఐశ్వర్య నార్కర్ తదితరులు
దర్శకత్వం: రవి జాదవ్
సినిమాల్లో, ఓటీటీ వెబ్‌సిరీస్‌లలో ఇప్పుడు బయోపిక్ ట్రెండ్ నడుస్తున్నది. వాస్తవికతకు సినిమాటిక్ డ్రామా జోడించి బయోపిక్‌లతో మంచి విజయాలను అందుకుంటున్నారు దర్శక, నిర్మాతలు. ట్రాన్స్జెండర్ల హక్కుల కోసం పోరాటం చేసిన శ్రీగౌరి సావంత్ జీవిత కథ ఆధారంగా ‘తాలీ’ నిర్మించారు. ఆరు ఎపిసోడ్లుగా తీసిన ఈ సిరీస్‌లో సుస్మితా సేన్ ప్రధాన పాత్ర పోషించింది. కథలోకి వెళ్తే.. గణేశ్ ఓ పోలీస్ కొడుకు. కొంత వయసు వచ్చిన తర్వాత అతను అమ్మాయిగా మారాలని భావిస్తుంటాడు. నడక, నడతల్లో ఆడపిల్లలను అనుసరిస్తుంటాడు. ఇది గమనించిన కుటుంబసభ్యులు గణేశ్ సమస్యను అర్థం చేసుకునే ప్రయత్నం చేయరు. కొన్నాళ్లకు అతని తల్లి చనిపోతుంది.
గణేశ్ విపరీత ధోరణికి కోపగించుకున్న తండ్రి.. అతణ్ని ఇంట్లో నుంచి వెళ్లగొడతాడు. 15 ఏండ్ల వయసులో పుణె నుంచి ముంబయికి వచ్చిన గణేశ్ శస్త్రచికిత్స ద్వారా ఆడపిల్లగా మారతాడు. తన పేరును గౌరి (సుస్మితా సేన్)గా మార్చుకుంటాడు. చుట్టూ ఉన్న సమాజం మాత్రం గౌరిని వింతగా చూస్తుంటుంది. అవమానిస్తుంటుంది. ఈ క్రమంలో తనలా అడుగడుగునా ఛీత్కారాలు ఎదుర్కొంటున్న ట్రాన్స్జెండర్ల పక్షాన నిలబడాలని భావిస్తుంది గౌరి. వాళ్ల హక్కుల కోసం ఆమె ఎలాంటి పోరాటం చేసింది? అమ్మ కావాలన్న తన కలను ఎలా నెరవేర్చుకుంది? అన్నది మిగిలిన కథ. హిందీ మాతృకకు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, బెంగాలీ తదితర భాషల్లో డబ్బింగ్ వర్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

