శ్వాసకు.. బాసటగా!

శరీరానికి ఊపిరితిత్తులు కీలకం. స్పాంజిలా ఉండే ఈ అవయవం గాలిలోంచి ఆక్సిజన్‌ను సేకరించి, శరీరానికి అందిస్తుంది. అదే సమయంలో శరీరంలో ఉత్పత్తి అయ్యే కార్బన్ డై ఆక్సైడ్ తదితరాలను బయటికి పంపడంలో కీలకపాత్ర పోషిస్తుంది. ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచుకోవడం ద్వారా అనేక రుగ్మతలకు దూరంగా ఉండవచ్చు. ఆ ప్రయత్నంలో కొన్ని కసరత్తులను సూచిస్తున్నారు నిపుణులు.
డయాఫ్రాగ్మటిక్ బ్రీతింగ్: పద్మాసనంలో కూర్చోవాలి. ఒక చేతిని నాభిస్థానం వద్ద, మరో చేతిని ఛాతీపై పెట్టుకోవాలి. ముక్కుతో మెల్లగా శ్వాస తీసుకోవాలి. అంతే నెమ్మదిగా ఊపిరిని వదలాలి. ఇలా చేసే క్రమంలో మనసును శ్వాసపై కేంద్రీకరించాలి. ఈ ప్రక్రియ హృదయస్పందనల రేటును తగ్గించడంతోపాటు రక్తపోటును స్థిరీకరిస్తుంది.
ముక్కు, నోరుద్వారా..
దీనిని ‘పర్స్యూడ్ లిప్ బ్రీతింగ్’ అంటారు. ముందుగా నిటారుగా కూర్చోవాలి. చేతులను కాళ్లపై పెట్టుకోవాలి. ముక్కుద్వారా మెల్లగా, ఎక్కువసేపు లోపలికి గాలిని పీల్చుకుని ఊపిరితిత్తులను నింపాలి. తరువాత, అంతే నెమ్మదిగా పీల్చిన గాలిని నోటిద్వారా మెల్లగా వదిలి వేయాలి. ఇలా చేయడం వల్ల ముక్కు, నోరు వాయుమార్గాల్లో ఉన్న మలినాలు తొలగిపోతాయి.
యాక్టివ్ సైకిల్ ఆఫ్ బ్రీతింగ్ టెక్నిక్స్
దీనినికూడా నోరు, ముక్కుద్వారా చేయాలి. స్థిరంగా ఒకచోట కూర్చుని ముందుగా నోటిద్వారా ఎక్కువ మొత్తంలో గాలిని ఊపిరితిత్తుల్లోకి తీసుకోవాలి. కొద్దిసేపు శ్వాసను అదిమిపట్టి ఆ తర్వాత నిదానంగా వదిలేయాలి. ఇదే పద్ధతిలో ముక్కు ద్వారా కూడా ఎక్కువ మొత్తంలో గాలిని తీసుకుని, కొద్దిసేపు అదిమి పట్టి అనంతరం వదిలేయాలి. ఈ ప్రక్రియలో ఊపిరితిత్తుల్లో పేరుకొన్న శ్లేష్మం, మలినాలను తొలగించుకోవచ్చు.
బెలూన్ బ్లోయింగ్ టెక్నిక్
శ్వాసక్రియ రేటును, శ్వాసకోశ కండరాలు, ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరిచే టెక్నిక్ ఇది. ఇందులో, ముందుగా ముక్కుద్వారా సాధ్యమైనంత ఎక్కువ మొత్తంలో మెల్లగా ఊపిరి తీసుకోవాలి. ఆ తర్వాత ఒక బెలూన్ను తీసుకుని ఆ గాలిని నెమ్మదిగా అందులో వదలాలి. సాధ్యమైనంత వరకు నిశ్వాసద్వారా ఆ బెలూన్ సైజ్‌ను పెంచాలి. ఇలా నిత్యం 10నుంచి 30 నిమిషాలపాటు సాధన చేయాలి.
స్ట్రా, గ్లాస్..
ఈ విధానంలో ఒక స్ట్రాను, సగం వరకూ నీళ్లున్న గాజు గ్లాసును తీసుకోవాలి. ముందుగా ముక్కుద్వారా నిండుగా గాలిని పీల్చుకోవాలి. ఆ తర్వాత గాలిని నోట్లోని స్ట్రాద్వారా గ్లాస్‌లోని నీటిలోకి వదలాలి. ఇలా, భారీగా బుడగలు సృష్టించాలి. దీనివల్ల ఊపిరితిత్తుల కండర వ్యవస్థను బలిష్టం చేసుకోవచ్చు. సంకోచ, వ్యాకోచాలను సజావుగా మార్చుకోవచ్చు.
స్పైరోమీటర్ ఎక్సర్సైజ్
శ్వాస సమస్యలతో బాధపడేవారికి స్పైరోమీటర్ ఎక్సర్సైజ్ ఎంతగానో తోడ్పడుతుంది. మార్కెట్లో దొరికే స్పైరోమీటర్ పైప్‌ను నోట్లో పెట్టుకుని గాలిని లోపలికి పీల్చుకోవాలి. సామర్థ్యం మేరకు ఊపిరితిత్తులను నింపాలి. ఆ సందర్భంగా స్పైరోమీటర్లోని బంతులు పైకి లేస్తాయి. వాటిని కొద్దిసేపు అలాగే గాలిలో పట్టి ఉంచేందుకు ప్రయత్నించాలి. తరువాత వదిలేయాలి. ఇలా 5 నిమిషాలపాటు చేయాలి. పిమ్మట స్పైరోమీటర్‌ను రివర్స్ చేసి శ్వాసను వదిలేస్తూ అదే విధానంలో 5 నిమిషాలు ప్రాక్టీస్ చేయాలి. దీనివల్ల ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుకోవచ్చు.
… మ్యాకం రవికుమార్
డాక్టర్ వెంకటరమణ
ఫిజియో థెరపిస్ట్
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

