వాహ్.. అనురాధా పాల్!
మహిళలు అన్ని రంగాలలోనూ ప్రావీణ్యం సాధిస్తూ ముందుకు సాగుతున్నారు. సంపాదనలోనే కాదు అన్ని విషయాలలోనూ మగవారితో సమానంగా దూసుకెళ్తున్నారు. ఉద్యోగం, వ్యాపారం, క్రీడలు ఇలా ప్రతి రంగంలోనూ తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు.
మహిళలు అన్ని రంగాలలోనూ ప్రావీణ్యం సాధిస్తూ ముందుకు సాగుతున్నారు. సంపాదనలోనే కాదు అన్ని విషయాలలోనూ మగవారితో సమానంగా దూసుకెళ్తున్నారు. ఉద్యోగం, వ్యాపారం, క్రీడలు ఇలా ప్రతి రంగంలోనూ తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఆ జాబితాలో చేరుతారు ప్రముఖ తబలా కళాకారిణి అనురాధా పాల్. ముంబయిలో పుట్టిన అనురాధా పాల్.. భారతదేశంలోనే తొలి తబలా కళాకారిణిగా నిలిచారు. తబలా కళాకారుల్లో లెజెండ్స్ అయిన ఉస్తాద్ అల్లారఖా, జాకీర్ హుస్సేన్ వద్ద దాదాపు ఇరవై సంవత్సరాలు శిక్షణ పొందారు.
దానిపై ఎన్నో పాటలు వాయించారు. మరెన్నో ప్రయోగాలు కూడా చేశారు. తబలా వాయిస్తూ పాటలు మాత్రమే కాదు, కథలు కూడా చెప్పవచ్చని అనురాధ నిరూపించారు. ఎంతో సాధన చేసి తబలాపై రామాయణ గాథను వినిపించి రికార్డు సృష్టించారు. ఉపన్యాసాలు, పాటలు విని విసిగిపోయిన ప్రజలు సంప్రదాయ సంగీతాన్ని ఆలకించడానికి ఆసక్తి చూపించడం లేదని కాలేజీలో జరిగిన ఒక కార్యక్రమంలో తెలుసుకున్నారు. అదే కార్యక్రమంలో తబలాపై కథ చెప్పారు. దానికి వన్స్‌మోర్ అంటూ అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత పది సంవత్సరాలు కష్టపడి తబలాపై రామాయణాన్ని సృష్టించి అరుదైన రికార్డును నెలకొల్పారు అనురాధా పాల్.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

