ఎన్నిసార్లు కిందపడినా మళ్లీ లేవాలనే ఆశ ఆమెకు సక్సెస్ ఒక అమ్మాయి ఎదుగుతుంటే చూసి ఓర్వలేని వ్యక్తులు కిందకు లాగారు. అయినా ఏమాత్రం బెదరకుండా తనకంటూ ఓ కొత్త మార్గాన్ని సృష్టించుకుంటూ సాగిపోతోంది ధరణి ప్రియ. యాంకర్ కెరీర్ ధరణి ప్రియ నటిగా, డ్యాన్సర్ నిరూపించుకున్నారు. కెరీర్లోనే కాదు కుటుంబపరంగానూ అందరి మెప్పూ పొంది ఫ్యామిలీ నెంబర్ వన్‌గా టైటిల్ చేసుకున్నారు. తన పదేండ్ల కెరీర్లో ఎదుర్కొన్న ఇబ్బందులు, వాటిని దాటుకుని తనుసాగిన తీరుని బబ్లీ గర్ల్ ధరణి ప్రియ ‘జిందగీ’కి వివరించారు..
మాది మరాఠీ కుటుంబం. కానీ నేను పుట్టి పెరిగిందంతా ఘట్కేసర్ అందుకే నా భాష పక్కా హైదరాబాదీ తెలంగాణ యాసలో ఉంటుంది. చిన్నప్పటి నుంచీ చాలా అల్లరి పిల్లని. ముగ్గురు అక్కాచెళ్లెళ్లలో చిన్నదాన్ని కావడంతో టామ్ పెరిగా. చదువులో మాత్రం జీరో. కంప్లీట్ ఎంత చెప్పినా నా బుర్రకి ఎక్కేది కాదు. నేను 10వ తరగతిలో ఉన్నప్పుడు ఏకంగా మా స్కూల్ ప్రిన్సిపాల్ నాన్నని పిలిచి నన్ను బోర్డ్ కుదరదని చెప్పారు. ఎందుకంటే నేను ఎగ్జామ్ రాస్తే వాళ్ల స్కూల్ తగ్గుతుందని. దాంతో నాన్న నాతో రెండు మూడు రోజులు మాట్లాడలేదు. మొదటిసారి నామీద నాకు కోపం వచ్చింది. ఎలాగైనా పదో తరగతి పాసవ్వాలని కష్టపడ్డా. ఫలితం దక్కింది. 60 శాతం మార్కులతో ఫస్ట్ పాసయ్యా. అప్పటినుంచీ చదువు విలువ అర్థమైంది. అందుకే ఇంటర్ 70 శాతం, ఇంజినీరింగ్ 80 శాతం మార్కులు సాధించా.
ఇంజినీరింగ్ కాలేజ్ కాలేజ్ కొన్ని స్పెషల్ ఱుపోగ్రామ్స్ నేను సరదాగా అన్ని షోస్ పాల్గొని అల్లరి చేసేదాన్ని. అప్పుడు ఒక ప్రొడ్యూసర్ ‘నువ్వు స్క్రీన్ బాగుంటావు, ట్రై చెయ్ అన్నారు. అప్పటివరకు యాక్టింగ్ ఎలాంటి ఆలోచనా లేని నేను అనుకోకుండా ఈ రంగంలోకి వచ్చాను. అయితే ఇండస్ట్రీకి వస్తానని ఇంట్లో చెప్పినప్పుడు మొదట్లో ఒప్పుకోలేదు. కానీ తర్వాత నన్ను అర్థం చేసుకుని సపోర్ట్ ఏదిఏమైనా రాత్రి తొమ్మిది దాటకుండా ఇంటికి వచ్చేయాలి, సినిమాల్లో నటించకూడదు అని షరతు పెట్టారు నాన్న. మొదటగా జెమినీలో ఓ ప్రోగ్రామ్ యాంకరింగ్ వచ్చింది. ఆ తర్వాత రంగస్థలం అనే డ్యాన్స్ పాల్గొన్నా. అప్పుడు చాలా సీరియల్స్ ఆఫర్స్ నెలలో 20 రోజులకు పైగా షూటింగ్స్ బిజీగా ఉండేదాన్ని. కానీ డేట్స్ క్లాష్ కొన్ని షోస్ వదులుకోవాల్సి వచ్చింది.
2014లో ఇండస్ట్రీకి వచ్చాను. వచ్చిన అవకాశాలను వదులుకోకుండా నిలదొక్కునేందుకు ప్రయత్నించాను. కానీ చాలాసార్లు సంతకం చేసిన షోస్ చేజారిపోయాయి. కొన్నిసార్లు డిప్రెషన్ వెళ్లేదాన్ని. అద్దంలో నన్ను నేను చూసుకుంటూ ఏడ్చేదాన్ని. 2016లో పెళ్లి చేసుకున్నా. మా ఆయన సపోర్ట్ మళ్లీ నిలదొక్కుకున్నా. సీరియల్స్ కలిసి రావట్లేదని సినిమాలను ఎంచుకున్నా.‘దువ్వాడ జగన్నాథం’, ‘బాలకృష్ణుడు’, ‘నేల టికెట్టు’ సినిమాల్లో హీరోయిన్ లుఫెండ్ చేశా. కానీ ఆ మూడు సినిమాలు ఆడకపోవడంతో ఇక సినిమాలు, సీరియల్స్ మళ్లీ అవకాశాల కోసం ప్రయత్నించా. ఆ సమయంలోనే జ్యోతి బిగ్ వెళ్లడంతో తీన్మార్ అవకాశం వచ్చింది. నాలుగేండ్లు అందులోనే ఉండిపోయా. అప్పుడే ప్రెగ్నెన్సీ రావడంతో బ్రేక్ ఏం చేసినా లైఫ్ ఏదో వెలితిగా అనిపించింది. అందుకే ఒక్క చోటే ఉండకూడదని నిర్ణయించుకున్నా. ఉద్యోగం మానేశా.
జీ తెలుగు ఫ్యామిలీ నెం.1 షోలో పాల్గొనే అవకాశం రావడం నిజంగా కొత్త గుర్తింపునిచ్చింది. నేను, నా కుటుంబం చాలా కష్టపడ్డాం. మొత్తానికి టైటిల్ ఇప్పుడు ఎక్కడికి వెళ్లినా మీరు ఫ్యామిలీ నెం.1 విన్నర్ ఆమోద మదర్ అని అడుగుతున్నారు. ఇన్నేండ్ల కెరీర్ రాని గుర్తింపు ఈ ఒక్క షో ద్వారా వచ్చింది. నాకు నటిగా మంచి గుర్తింపు తీసుకొచ్చిన సీరియల్ ఆధారం’. అందులో నెగెటివ్ కనిపించా. ఆ సీరియల్ నేను ఎదురుపడితే కొందరు ఫ్యాన్స్ కూడా. అంతగా ఆ క్యారెక్టర్ ఆదరించారు. నా క్యారెక్టర్ హీరోయిన్ నెగెటివ్ పాజిటివ్ దాంతో రెస్పాన్స్ ఇక సీరియల్స్ నిర్ణయించుకున్నా.
మా ఆయన మోహిత్ నేను స్కూల్ వుఫెండ్స్ పెండ్లి తర్వాత నా భర్త నన్ను చాలా సపోర్ట్ మా అమ్మాయే మా ఇంటి మహాలక్ష్మి. తను పుట్టిన తర్వాత జీవితం పరిపూర్ణమయ్యిందనిపించింది. నా సంపాదన మొత్తం బిజినెస్ పెట్టాను. చాలామంది నీకెందుకు బిజినెస్ డీమోరలైజ్ నిజానికి సంపాదించడానికి నేను బిజినెస్ కొన్నిసార్లు అవకాశాలు లేకపోవడంతో మానసికంగా కుంగిపోకుండా ఉండేందుకు ఒక డైవర్షన్ బొటిక్ ప్రస్తుతానికి ఓ వెబ్ ఫొటో షూట్ నా అభిమానులు నన్ను మొదటినుంచీ ఆదరించారు. వాళ్లకోసం ఏదైనా చేయాలనే తాపత్రయంతో పనిచేస్తున్నా. వాళ్లకు ఎప్పటికీ రుణపడి ఉంటా. ఒకసారి లైవ్ వెళ్లినప్పుడు ఒక అమ్మాయి నా షోస్ సంబంధించిన ఫొటోస్ ఒక బుక్ నా ప్రతి ఫొటోకి ఒక కొటేషన్ ఆ బుక్ నా దగ్గర ఉంది. ఒక బెంగళూరు అబ్బాయి కన్నడ నేర్చుకో అక్కా.. అని నేర్పించాడు. నా అభిమానుల ప్రోత్సాహంతో ఎన్నిసార్లు కింద పడినా అంతకు రెట్టింపు వేగంతో తిరిగిలేస్తూ ఇలా సాగిపోతున్నా!
– హరిణి