నడుముకు బలం

నెలలు నిండే కొద్దీ గర్భిణి నడుముమీద ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. ప్రసవం తర్వాతకూడా ఈ ప్రభావం ఉంటుంది. ఫలితంగా దీర్ఘకాలంలో రకరకాల సమస్యలు ఎదురవుతాయి. గర్భిణి చిన్నపాటి వర్కవుట్లు చేయగలిగితే నడుంపై ఒత్తిడి తగ్గుతుంది. ‘కటి వలయం’గా పిలిచే ఈ వ్యాయామ ప్రక్రియలు నడుముకు బలాన్ని చేకూరుస్తాయి.
ముందుగా నిటారుగా తాడన స్థితిలో నిలబడాలి. ఇప్పుడు రెండు చేతులనూ నడుముమీద పెట్టి, తుంటి (హిప్) భాగాన్ని ఇరుపక్కలకూ ఆడించాలి. కుడి, ఎడమ పక్కలకు పదిసార్లు కదిలించి తిరిగి తాడన స్థితిలోకి రావాలి.
నడుముమీద రెండు చేతులు పెట్టి, తుంటిభాగాన్ని క్లాక్వైజ్లో గుండ్రంగా తిప్పాలి. ఇలా పదిసార్లు చేయాలి. తర్వాత యాంటీ క్లాక్వైజ్లో పదిసార్లు తిప్పాలి. పూర్తయిన తర్వాత తిరిగి తాడనస్థితిలోకి రావాలి.
తాడనస్థితిలో నిటారుగా నిలబడాలి. ఎడమచేతిని మోచేయి దగ్గర వంచి అరచేతిని కుడిభుజం మీద పెట్టాలి. అదే సమయంలో కుడిచేతిని వెనక్కి స్ట్రెచ్ చేయాలి. మళ్లీ కుడిచేతిని ఎడమభుజంపై ఉంచి, ఎడమ చేతిని వెనక్కి స్ట్రెచ్ చేయాలి. ఇలా పదిసార్లు కుడివైపు, పదిసార్లు ఎడమవైపు చేయాలి.
కండ్లు తిరుగుతున్నా, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది ఉన్నా ఈ వర్కవుట్లు చేయకూడదు. ఆరోగ్య సమస్యలున్న వారు నిపుణుల సూచన తర్వాతే ప్రయత్నించాలి.
ఎడమచేతిని నడుంపై ఉంచి, కుడిచేతిని నిదానంగా పైకి ఎత్తి (చిత్రంలో చూపిన విధంగా) ఎడమవైపు కాస్త వంగాలి. మళ్లీ కుడిచేతిని నడుం మీద ఉంచి, ఎడమచేతిని పైకెత్తి కుడివైపు బెండ్ అవ్వాలి. ఇలా ఇరువైపులా పదేసి సార్లు చేయాలి. ఈ చిన్నపాటి వర్కవుట్లవల్ల కండరాలపై ఒత్తిడి తగ్గుతుంది.
అనితా అత్యాల
ప్రెగ్నెన్సీ యోగా నిపుణురాలు
6309800109
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

