సూపర్‌స్టార్ కూతురిగా కాకుండా, తనకంటూ సొంత గుర్తింపును సాధించుకుంటున్నది సితార ఘట్టమనేని. తను త్వరలోనే ఓ ఫ్యాషన్ బ్రాండ్‌తో కలిసి పనిచేయనుంది. సితార పెయింటింగ్స్‌తో టీ-షర్ట్స్, హూడీలు మార్కెట్లోకి రానున్నాయి. ఆ ఆదాయాన్ని ‘జీఎంబీ ఫౌండేషన్’ ద్వారా అనాథ బాలికల చదువుకోసం వినియోగిస్తానని ప్రకటించింది సూపర్ లిటిల్ స్టార్. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వేదికగా సితార పంచుకునే వీడియోలు, ఫొటోలకు లైకులు, వ్యూస్ భారీగా ఉంటాయి. తొమ్మిదేండ్లకే రకరకాల వీడియోలు చేస్తూ యూట్యూబ్ చానల్ ద్వారా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సాధించుకున్నది. ట్రెండింగ్‌లో ఉండే పాటలకు వీడియోలతోపాటు నటీనటులను ఇంటర్వ్యూ కూడా చేస్తున్నది.
తండ్రి మహేశ్‌బాబు, తల్లి నమ్రతా శిరోద్కర్, అన్న గౌతమ్‌తో కలిసి తాను చేసే అల్లరి పనులనూ అభిమానులతో పంచుకుంటున్నది. ఫ్యాషన్, పెయింటింగ్, వంటలు.. ఒకటేమిటి, అన్నింటా నేనున్నానని అంటున్నది సితార.