వాటిని చూసి నవ్వుకుంటాం..
సంచలన వార్తలకు కేరాఫ్ అడ్రస్ మలైకా అరోరా! ఈ ఓల్డ్ అండ్ బ్యూటీ ఏం చేసినా సంచలనమే! జిమ్‌కు వెళ్లినా, పార్టీలో కనిపించినా.. అది సెన్సేషనల్ న్యూసే! అర్జున్ కపూర్‌తో విడిపోయిన తర్వాత మలైకా జీవితంలోకి మరొకరు వచ్చారంటూ ఇటీవల బీటౌన్ కోడై కూసింది.
సంచలన వార్తలకు కేరాఫ్ అడ్రస్ మలైకా అరోరా! ఈ ఓల్డ్ అండ్ బ్యూటీ ఏం చేసినా సంచలనమే! జిమ్‌కు వెళ్లినా, పార్టీలో కనిపించినా.. అది సెన్సేషనల్ న్యూసే! అర్జున్ కపూర్‌తో విడిపోయిన తర్వాత మలైకా జీవితంలోకి మరొకరు వచ్చారంటూ ఇటీవల బీటౌన్ కోడై కూసింది. స్పిట్స్‌విల్లా-16లో కంటెస్టెంట్ అయిన సోరబ్ బేడీతో మలైకా దిగిన ఒక ఫొటో సోషల్‌మీడియాలో వైరల్ అయ్యింది. దాంతో, వీళ్లిద్దరూ డేటింగ్లో ఉన్నారనే వార్తలు షికారు చేయగా.. సామాజిక వేదికలపైనా పెద్ద చర్చే సాగింది. ఈ ప్రచారంపై మలైకా తాజాగా నోరు విప్పింది. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనపై వస్తున్న వార్తలను కొట్టిపారేసింది. “ఇలాంటి పుకార్లు విన్నప్పుడు గతంలో చాలా చిరాకుగా అనిపించేది. కానీ, ఇప్పుడు వాటిని జోక్‌గా తీసుకోవడం అలవాటైంది.
నేను, నా కొడుకు అర్హాన్.. ఈ డేటింగ్ వార్తలను చూసి నవ్వుకుంటాం కూడా!” అంటూ చెప్పుకొచ్చింది. స్నేహితులు, సహోద్యోగులు, తోటి నటులు.. ఇలా ఎవరితో కనిపించినా, వారితో ముడిపెట్టి వార్తలు రాయడం కొందరికి పరిపాటిగా మారిందని విమర్శించింది. ప్రస్తుతం తన జీవితాన్ని, కెరీర్‌ని ఎంతో సంతోషంగా గడుపుతున్నాననీ, తన జీవితంలో ఏదైనా జరగాలని ఉంటే అది జరుగుతుందని వేదాంత ధోరణిలో మాట్లాడింది. జీవితానికి ఒకరు తోడుగా ఉండటం, భాగస్వామి దొరకడం అందమైన విషయాలైనా.. తన జీవితం పరిపూర్ణం కావడానికి ఒక పురుషుడు తోడుండాలని తాను అనుకోవడం లేదని మలైకా చెప్పుకొచ్చింది.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Akhilesh Yadav | ఉత్తర ప్రదేశ్‌లో 19 లక్షల దొంగ ఓటర్లు.. ఎన్నికల సంఘం, సర్‌పై అఖిలేష్ సంచలన ఆరోపణలు
KTR | రూ.3 వేల కోట్ల విదేశీ బొగ్గు స్కామ్ ఆపాలి.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ లేఖ
Faf Du Plesis | ఈ పేస్ త్రయం చాలా డేంజర్.. టెస్టుల్లో వీరిని ఎదుర్కోలేం..!
Delhi Police | రేపే సీజేపీ భారీ నిరసన.. అన్ని జాగ్రత్తలు తీసుకుంటామన్న ఢిల్లీ పోలీసులు
ACB Raid | ఏసీబీకి చిక్కిన విద్యుత్ ఏఈ..రూ.1.20 లక్షల లంచం తీసుకుంటూ పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

