కావలసిన పదార్థాలు
గోధుమపిండి: ఒక కప్పు, సొరకాయ తురుము: ఒక కప్పు, పచ్చిమిర్చి: రెండు, కొత్తిమీర, కరివేపాకు తురుము: కొద్దిగా, జీలకర్ర: ఒక టీస్పూన్, మిరియాల పొడి: అర టీస్పూన్, ఉప్పు: తగినంత, కారం: ఒక టీస్పూన్, నూనె: రెండు టేబుల్ స్పూన్లు.
తయారీ విధానం
ఒక గిన్నెలో గోధుమపిండి, సొరకాయ తురుము, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర, మిరియాలపొడి, ఉప్పు, కారం వేసి బాగా కలిపి కొంచెం కొంచెం నీళ్లు పోస్తూ ముద్దలా కలపాలి. చివరగా ఒక టేబుల్ స్పూన్ నూనెవేసి మరోసారి కలిపి పది నిమిషాలు పక్కనపెట్టాలి. పిండి మిశ్రమాన్ని చిన్నచిన్న ముద్దలుగా చేసుకుని పిండివేస్తూ చపాతీలు ఒత్తుకోవాలి. స్టవ్‌మీద పెనం పెట్టి వేడయ్యాక చపాతీలను రెండు వైపులా నూనెవేస్తూ కాల్చుకుంటే వేడివేడి సొరకాయ చపాతీలు సిద్ధం.