ఉంగరాల జుట్టు.. ముఖారవిందాన్ని రెట్టింపు చేస్తుంది. అదే సమయంలో లేనిపోని చికాకునూ కలిగిస్తుంది. వాస్తవానికి కర్లీ హెయిర్ పొడిగా ఉంటుంది. నిర్జీవంగా కనిపిస్తుంది. దీన్ని మెయింటెయిన్ చేయడం కూడా కొంచెం కష్టంగానే ఉంటుంది. అయితే, ఇలాంటి వారికి సౌందర్య నిపుణులు కొన్ని సలహాలు అందిస్తున్నారు.