‘ముక్కు’ సూటిగా..

ఇప్పటికీ కొవిడ్‌కు, వాసన తెలియక పోవడానికి మధ్య సంబంధాన్ని శాస్త్రవేత్తలు గుర్తించలేక పోతున్నారు. అయితే, వాసనను కోల్పోయిన రోగులతో పోలిస్తే, కోల్పోని రోగులకే కరోనా ప్రాణాంతకమవుతున్నది.
వాసన కోల్పోవడం అన్నది అల్జీమర్స్తోపాటు ‘ల్యూపస్’ అనే ఆటో ఇమ్యూన్ వ్యాధికికూడా ముందస్తు సంకేతం. పార్కిన్సన్ రోగుల ప్రాథమిక లక్షణమూ ఇదే.
వయసు పెరిగేకొద్దీ వాసనను గుర్తించే శక్తి తగ్గుతుంది. వృద్ధాప్యంలో మూడొంతుల మంది వాసనను కోల్పోతారని నిపుణులు చెబుతున్నారు. ధూమపానం కూడా ఘ్రాణశక్తిని దెబ్బతీస్తుంది.
పురుషులకంటే మహిళలే వాసనలమధ్య తేడాలను త్వరగానూ, కచ్చితంగానూ గుర్తిస్తారని అధ్యయనాలు చెబుతున్నాయి.
గర్భిణులకైతే ఘ్రాణశక్తి మరింత పదునుగా ఉంటుంది. ఆ ప్రత్యేకతే విష పదార్థాలను తీసుకోకుండా అడ్డుకుంటుంది. డిప్రెషన్కూడా వాసనను గుర్తించే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది.
సృష్టిలో ఏ వాసననూ కంపు అనో, ఇంపు అనో అనడానికి వీల్లేదు. ఆ వాసనకు సంబంధించి నెగెటివ్ ఆలోచన మెదడులో అప్పటికే గూడు కట్టుకుని ఉండటంతో ‘బ్యాడ్ స్మెల్’ అని ముక్కు మూసుకుంటాం. మెదడులో పాజిటివ్‌గా రిజిస్టరై ఉండటంతో ‘గుడ్ స్మెల్’ అని నిండుగా పీల్చుకుంటాం. తుడిచి పెట్టుకుపోయిన జ్ఞాపకాలను గుర్తు చేయడంలో వాసనకూడా తన వంతు ఉపయోగపడుతుంది.
అనోస్మియాతో బాధపడేవాళ్లకు వాసనను గుర్తించే సామర్థ్యం ఉండదు. దట్టమైన పొగను, పాడైపోయిన పాల వాసనను కూడా పట్టుకోలేరు. దీంతో వారు కొన్నిసార్లు అగ్ని ప్రమాదాలకు గురయ్యే ప్రమాదం ఉంటుంది. విషాహారం తిని ప్రాణాలమీదికి తెచ్చుకునే పరిస్థితీ ఎదురుకావచ్చు.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

